AP: అనంతపురం జిల్లాలో విషాదం.. ఓ ఇంట్లో మూడు మృతదేహాలు లభ్యం..

|

May 25, 2021 | 1:57 PM

3 dead bodies found in penukonda: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. జిల్లాలోని పెనుకొండలోని ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో

AP: అనంతపురం జిల్లాలో విషాదం.. ఓ ఇంట్లో మూడు మృతదేహాలు లభ్యం..
murder
Follow us on

3 dead bodies found in penukonda: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. జిల్లాలోని పెనుకొండలోని ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ముగ్గురు వృద్ధులు మరణించారు. పట్టణంలోని వేణుగోపాలస్వామి గుడి సమీపంలోని ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో పక్క ఇంట్లో ఉన్న వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంట్లోకి వెళ్లి చూడగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నమూడు మృతదేహాలను గుర్తించారు. అనంతరం ఆ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మడకశిరలోని ఓ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసి రిటైరైన అశ్వర్థప్ప (80), తన ఇద్దరు చెల్లెళ్లతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వయసు మీద పడడం.. కరోనా కాలం కావడంతో వారికి సహాయం చేసే వారు లేక ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కీటకాల మందు తిని ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

PPF Account: మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారా.? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.!

Covid Test kit ‘ViraGen’: ఇకపై ఇంట్లోనే కరోనా పరీక్ష.. అందుబాటులోకి వచ్చిన కొత్త ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టింగ్‌ కిట్‌

Covid-19: లాక్‌డౌన్ ఆంక్షల బేఖాతరు.. కోచింగ్ సెంటరులో 555 మంది విద్యార్థులు.. యజమాని అరెస్ట్..