Arjun Singh: బీజేపీ ఎంపీ ఇంటిపై నాటు బాంబులతో దాడి.. బెంగాల్‌లో శాంతి భద్రతలపై గవర్నర్ ఆందోళన..

|

Sep 08, 2021 | 1:13 PM

BJP MP Arjun Singh: పశ్చిమ బెంగాల్‌లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల తర్వాత రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలోనే ఓ బీజేపీ ఎంపీ ఇంటిపై కొందరు దుండగులు బాంబులతో దాడులు

Arjun Singh: బీజేపీ ఎంపీ ఇంటిపై నాటు బాంబులతో దాడి.. బెంగాల్‌లో శాంతి భద్రతలపై గవర్నర్ ఆందోళన..
Bjp Mp Arjun Singh
Follow us on

BJP MP Arjun Singh: పశ్చిమ బెంగాల్‌లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల తర్వాత రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలోనే ఓ బీజేపీ ఎంపీ ఇంటిపై కొందరు దుండగులు బాంబులతో దాడులు చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బారక్‌పూర్‌ పట్టణంలో ఉన్న బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ నివాసంపై బుధవారం తెల్లవారుజామున కొందరు దుండగులు నాటు బాంబులు విసిరారు. దుండగులు ఇంటి ప్రధాన ద్వారం 3 నాటు బాంబులను విసిరినట్లు పోలీసులు తెలిపారు.ఈ బాంబుల దాడిలో అర్జున్ సింగ్ కుటుంబ సభ్యులెవరూ గాయపడలేదు. ఈ సంఘటన జరిగిన వెంటనే పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు.
ఎంపీ అర్జున్ సింగ్ ఇంటి ముందు బాంబు పేలుళ్ల ఘ‌ట‌న జ‌రిగింద‌ని, ఇది ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌ని గవర్నర్ ట్వీట్ చేశారు. ఈ బాంబు పేలుళ్లు శాంతిభద్రతలపై ఆందోళన కలిగిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ పోలీసుల సత్వర చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు.


కాగా.. ఈ ఘటన అనంతరం బారక్‌పూర్ కమిషనరేట్ నుంచి పోలీసు బలగాలను భారీ సంఖ్యలో ఎంపీ నివాసానికి తరలించారు. నిందితులను గుర్తించడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బైక్‌పై వ‌చ్చిన ముగ్గురు దుండగులు బాంబులు విసిరిన‌ట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉద‌యం 6.30 నిమిషాల‌కు జరిగిన ఈ ఘ‌ట‌న అనంతరం.. ఢిల్లీలో ఉన్న ఎంపీ అర్జున్ సింగ్ .. హుటాహుటిన కోల్‌క‌తాకు ప‌య‌న‌మ‌య్యారు. కాగా.. ఎంపీ ఇంటి ఎదుట బాంబు పేలుళ్ల ఘ‌ట‌న‌కు పాల్పడిందని తృణ‌మూల్ కాంగ్రెస్ అని బీజేపీ ఆరోపిస్తోంది. కాగా.. త్వరలో పశ్చిమ బెంగాల్ లో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ఈ బాంబు దాడులు జరగడంతో ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Also Read:

శునకాలపై మహిళల దాష్టీకం.. పిల్లలతో సహా తల్లి కుక్కను దహనం చేసేశారు.. ఆ తర్వత ఏమైందంటే..?

Crime News: దారుణం.. ప్రేమించి పెళ్లి చేసుకుందని.. కడుపులో బిడ్డను చంపారు.. బలవంతంగా..