ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దొంగతనాలను చూశాం. ఇందులో డబ్బును దోచుకెళ్లేవారు కొందరైతే, ఫోన్లను దొచేసేవారు కొందరు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో ఉన్నాయి. కానీ, ఇప్పుడు చెప్పబోయే దొంగతనం మాత్రం.. మీరు ఎప్పుడూ, ఎక్కడా చూసి ఉండరు. అవును.. అది కూడా ఎక్కడో కాదు.. మన హైదరాబాద్‌లోనే ఈ వింత దొంగతనం జరగడం విశేషం. ఈ వింత దొంగతనం చూసిన జనాలు, పోలీసులు షాకవుతున్నారు. అసలు ఈ వింత దొంగతన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ దొంగలు మాత్రం.. తమ రూటే సపరేటు అంటూ ఏకంగా ఓ భారీ స్కెచ్ వేశారు. మేకలపై కన్నేసిన ఈ వెరైటీ దొంగలు.. బాగానే ప్లాన్ చేశారు కానీ, సీసీ కెమెరాలు ఉన్న విషయం మర్చిపోయారు. బక్రీద్ పండగ నేపథ్యంలో మేకలను అమ్మడానికి మేకలను సోని గ్రూప్ హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టకు తీసుకొచ్చారు. రాత్రి సమయంలో సోని గ్రూప్ వద్ద నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 23 మేకలను దొంగతనం చేసి షాకిచ్చారు. అనంతరం మేకలు పోయాయని గ్రహించిన యజమాని.. చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు తీసుకున్న పోలిసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నలుగురిని అడుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. గతంలో కూడా వీరిపై నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు.