Sucide: కూకట్‌పల్లిలో విషాదం.. బాలుడి ప్రాణం తీసిన వీడియో గేమ్‌..! ఉరి వేసుకొని..

|

Jun 26, 2021 | 6:29 PM

Student Sucide in Hyderabad: ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతున్న ఓ బాలుడు.. ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌ కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌

Sucide: కూకట్‌పల్లిలో విషాదం.. బాలుడి ప్రాణం తీసిన వీడియో గేమ్‌..! ఉరి వేసుకొని..
Sucide
Follow us on

Student Sucide in Hyderabad: ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతున్న ఓ బాలుడు.. ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌ కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన సంచలనంగా మారింది. వివరాలు.. కూకట్‌పల్లిలోని సంగీత్‌ నగర్‌లో నివసించే ఆనంద్‌, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు.
వారిలో ఒకరు మణికంఠ (12) ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో తల్లిదండ్రులు, అతని అన్నయ్య ఉద్యోగాలకు వెళ్లిన సమయంలో ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో.. శనివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో మణికంఠ చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేకున్నాడు. బాలుడు ఉరివేసుకొని ఉండటాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతికిగల కారణాలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కుటుంబసభ్యుల నుంచి పలు వివరాలను సేకరించారు. అయితే.. మణికంఠ వద్ద ఉన్న మొబైల్‌లో వీడియోగేమ్‌ ఓపెన్‌ చేసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వీడియోగేమ్‌లు చూస్తూ .. ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతోపాటు బాలుడి కాల్ డేటా, తదితర వివరాలను కూడా సేకరిస్తామని తెలిపారు.

Also Read:

దారుణం..మూడుముళ్ళు పడ్డ మూడు రోజులకే..నవ వధువుపై భర్త.. మరుదుల సామూహిక అత్యాచారం!

Delta Plus variant: వణికిస్తున్న డెల్టా వేరియంట్.. తమిళనాడులో తొలి మరణం నమోదు..