Hallo Majra : చండీగఢ్ లోని హలోమజ్రా లో ఘోరం జరిగింది. 6 ఏళ్ల బాలికను 12 ఏళ్ల బాలుడు హత్య చేశాడన్న విషయం సంచలనంగా మారింది. బాలికపై అత్యాచారం చేసిన తర్వాత మొహంపై రాయితో మోదీ ఆనవాళ్లు తెలియకుండా చేసేందుకు సదరు బాలుడు ప్రయత్నించాడా..? అనే విషయం యావత్ రాష్ట్రాన్నే కలవరపాటుకు గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే, శుక్రవారం సాయంత్రం నుంచి బాధిత బాలిక కనిపించకుండాపోయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలిక ఆచూకీ కోసం ప్రయత్నిస్తోన్న పోలీసులకు హలో మజ్రా లైట్ పాయింట్ దగ్గర చెట్ల ప్రాంతంలో బాలిక మృతదేహం కనిపించింది. ఈ కేసుకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు శనివారం సాయంత్రం 12 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలోని క్లోజ్-సర్క్యూట్ కెమెరాల్లో అనుమానిత బాలుడు బాధిత బాలికతో కలిసి సైకిల్ పై వెళ్తున్న చిత్రాలు రికార్డ్ అయినట్టు పోలీసులు గుర్తించారు. వీటి ఆధారంగా బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. నిందితుడ్ని ఇవాళ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టనున్నారు.
ఈ క్రమంలో హలో మజ్రా గ్రామం ఉద్రిక్తంగా మారింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. హలో మజ్రా నివాసితులంతా కలిసి వీధుల్లోకి వచ్చి, చండీగఢ్ – అంబాలా రహదారిపై నిరసనకు దిగడంతో భారీగా ట్రాఫిక్ కు దాదాపు నాలుగు గంటలపాటు అంతరాయం కలిగింది. దీంతో జిరాక్‌పూర్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ట్రిబ్యూన్ చౌక్‌లోని ట్రాన్స్‌పోర్ట్ లైట్ పాయింట్ వైపు, ఇంకా పౌల్ట్రీ ఫామ్ చౌక్ నుండి ఇండస్ట్రియల్ ఏరియా, ఫేజ్ -1 వైపు మళ్లించాల్సి వచ్చింది.
Read also : Vikarabad stabbing : వికారాబాద్ లో ఆదివారం ఉదయంపూట కలకలం, పాండు గౌడ్ ను కత్తితో పోట్లుపొడిచిన నవీన్ గౌడ్