Covid-19 vaccine: గుడ్ న్యూస్.. త్వరలోనే పిల్లలకు కరోనా వ్యాక్సిన్.. వెల్లడించిన కేంద్రం

|

Jul 17, 2021 | 6:50 AM

Zydus Cadila's Covid vaccine: దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. థర్డ్ వేవ్ ముంచుకొస్తుందన్న సూచనలతో..

Covid-19 vaccine: గుడ్ న్యూస్.. త్వరలోనే పిల్లలకు కరోనా వ్యాక్సిన్.. వెల్లడించిన కేంద్రం
Covid vaccine
Follow us on

Zydus Cadila’s Covid vaccine: దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. థర్డ్ వేవ్ ముంచుకొస్తుందన్న సూచనలతో.. మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సిన్‌ను 18 ఏళ్లకు పైబడిన వారందరికీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిన్నారులకు వ్యాక్సిన్ ఇచ్చేందకు క్లినికల్ ట్రయల్స్ ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం మురో శుభవార్త చెప్పింది. జైడస్ క్యాడిల్లా సంస్థ రూపొందించిన డీఎన్ఏ ఆధారిత జైకోవ్-డీ (ZyCoV-D) కరోనా వ్యాక్సిన్‌ 12 నుంచి 18 ఏళ్ల వారికి ఉపయోగించేందుకు క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసినట్లు కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియ పూర్తయిందని త్వరలోనే వ్యాక్సిన్ అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తెలియజేసింది. త్వరలోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నదని వెల్లడించింది.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ ఢిల్లీ హైకోర్టుకు అఫిడవిట్‌ దాఖలు చేశారు. డీఎన్‌ఏ వ్యాక్సిన్ రూపొందించిన జైడస్ క్యాడిల్లా 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న వారి కోసం క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు. గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని జైడస్ క్యాడిల్లా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ చట్టబద్ధమైన ఆమోదం పొందేందుకు సిద్ధంగా ఉందన్నారు. త్వరలోనే ఈ వ్యాక్సిన్ చిన్నారులకు వినియోగించేందుకు అందుబాటులోకి వస్తుందని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది. దీంతోపాటు ఈ టీకాకు రెగ్యులేటరీ అనుమతులు కూడా మంజూరు చేస్తామని వెల్లడించింది. కాగా.. 12-17 ఏళ్ల వయసున్న పిల్లలకు వెంటనే టీకాను అందుబాటులోకి తీసుకురావాలని టియా గుప్తా అనే మైనర్‌ బాలుడు.. ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేయగా.. కేంద్రం ఈ విధంగా స్పందించింది.

Also Read:

Covid-19 Third Wave: కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తోంది.. రానున్న రోజులు కఠినమైనవే: వీకే పాల్

COVID Precautions: “వ్యాన్‌ దగ్గరకు రండి..చేతులు శుభ్రం చేసుకోండి”.. పరిశుభ్రతతో కరోనాకు చెక్.. టీవీ9 వినూత్న కార్యక్రమం