క్వారంటైన్‌లో ఉన్న యువకుడి ఆత్మహత్య.. కారణం ఇదే!

చెన్నైలోని తేని గవర్నమెంట్ కాలేజీ క్వారంటైన్‌లో ఉన్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో అక్కడి ఉన్నవారంతా ఆందోళనకు గురయ్యారు. తేని జిల్లా అండి పట్టికి చెందిన శశికుమార్ రెండు రోజుల క్రితం ముంబై నుంచి..

క్వారంటైన్‌లో ఉన్న యువకుడి ఆత్మహత్య.. కారణం ఇదే!

Updated on: May 19, 2020 | 10:14 AM

చెన్నైలోని తేని గవర్నమెంట్ కాలేజీ క్వారంటైన్‌లో ఉన్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో అక్కడి ఉన్నవారంతా ఆందోళనకు గురయ్యారు. తేని జిల్లా అండి పట్టికి చెందిన శశికుమార్ రెండు రోజుల క్రితం ముంబై నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతనికి కరోనా వైరస్ టెస్ట్ చేయగా.. లక్షణాలు కనిపించడంతో క్వారంటైన్‌కు తరలించారు. 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. అయితే తనకు ఎలాంటి వైరస్ లేనప్పుడు.. ఇక్కడ ఎందుకు ఉండాలని అధికారులను నిలదీశాడు. అయితే వైరస్ నియంత్రణ అధికారులు అతనికి నచ్చజెప్పి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత సోమవారం ఉదయం శశికుమార్ క్వారంటైన్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మరణ సమాచారంతో అధికారులు ఉలిక్కి పడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. క్వారంటైన్‌కు తరలించామని ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మరేదైనా కారణమా? అని పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: 

కేంద్రం బంపర్ ఆఫర్.. ఈజీగా రూ.50 వేలు పొందాలంటే.. ఇలా చేయండి

ఫస్ట్‌ టైమ్ షర్ట్ లేకుండా మహేష్.. ఫొటో వైరల్

Loading...
Unable to load recommendations.
Follow Us