యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో సర్వదర్శనాలు మొదలయ్యాయి. తిరుమల తరహాలో తొలి రోజు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ముందుగా ఆలయ సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు, స్థానికులకు ఈ రోజు అవకాశం కల్పిస్తున్నారు. రేపటి నుంచి భక్తులందరికీ దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు దేవస్థానం సిబ్భంది. మాస్కులు ధరించటం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి చేశారు. లడ్డు ప్రసాద కౌంటర్ల వద్ద తగిన ఏర్పాట్లు చేయనున్నారు. ఆలయంలోపల తీర్థ ప్రసాదాలను నిషేధించారు. దేవస్థానం అనుమతించే వరకు చిన్నపిల్లలు, వృద్ధులు దర్శనాలకు రావొద్దని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. అయితే, ఆలయానికి చేరుకొనేందుకు కొన్ని ఆంక్షలు విధించారు. కొండ కింది నుంచి భక్తులు కాలినడకనే ఆలయానికి చేరుకోవాలని నిబంధన విధించారు. కొండపైకి ఏ వాహనాలకు అనుమతివ్వబోరని అధికారులు వెల్లడించారు.
లాక్‌డౌన్‌కు ముందు యాదాద్రి కొండపై సత్యనారాయణ స్వామి వ్రతాల కోసం ఒక్కో బ్యాచ్‌కు ఒక హాల్‌లో 250 జంటలు పూజకు కూర్చునేలా అనుమతించేవారు. కానీ, ప్రస్తుతం ఒక్కో బ్యాచ్‌కు 50 మంది దంపతులు మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.