ప్రపంచ వ్యాప్తంగా కరోనా టెర్రర్.. రికార్డు స్థాయిలో కేసులు నమోదు..

ప్రపంచ వ్యాప్తంగా నిన్న 2,14,260 మందికి కోవిడ్ సోకడంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,46,28,919కి చేరుకుంది. కాగా కరోనాతో మొత్తం ఇప్పటివరకూ 6,08,508 మంది మరణించారు. ఇక ప్రస్తుతం 52,91,476 యాక్టీవ్ కేసులు ఉండగా, 87,89,935 మంది కోవిడ్..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా టెర్రర్.. రికార్డు స్థాయిలో కేసులు నమోదు..

Edited By:

Updated on: Jul 20, 2020 | 11:00 AM

ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ కరోనా వైరస్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే ఈ వైర‌స్ బారిన ప‌డి ప‌లువురు ప్ర‌ముఖులు కన్నుమూసిన విష‌యం తెలిసిందే. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా నిన్న 2,14,260 మందికి కోవిడ్ సోకడంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,46,28,919కి చేరుకుంది. కాగా కరోనాతో మొత్తం ఇప్పటివరకూ 6,08,508 మంది మరణించారు. ఇక ప్రస్తుతం 52,91,476 యాక్టీవ్ కేసులు ఉండగా, 87,89,935 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక అమెరికాలో క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న తాజాగా 60689 కరోనా కసులు నమోదయ్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ దేశ వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 38,93,960కు చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ 1,43,263 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, స్పెయిన్, లండన్, పాకిస్తాన్, ఇటలీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి.

అలాగే భారత్​లో కరోనా వ్యాప్తి తీవ్ర‌త‌రం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 24 గంటల్లో అత్యధికంగా రికార్డు స్థాయిలో 40,425 కరోనా పాజిటివ్​ కేసులు నమోదవ్వగా, 681 మంది కోవిడ్ కార‌ణంగా మరణించారు. కాగా దేశ‌వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11,18,043కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 3,90,459 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య ఏడు లక్షలుగా ఉంది. దేశం మొత్తం కరోనాతో మృతుల సంఖ్య 27,497కి చేరుకుంది.

Read More: మరో మంత్రికి కరోనా పాజిటివ్..