మరో మంత్రికి కరోనా పాజిటివ్..

దేశ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి విస్తరిస్తోన్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. ముఖ్యంగా నిత్యం ప్రజల్లో ఉండే రాజకీయ నాయకులకు..

మరో మంత్రికి కరోనా పాజిటివ్..
Follow us

| Edited By:

Updated on: Jul 20, 2020 | 10:23 AM

దేశ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి విస్తరిస్తోన్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. ముఖ్యంగా నిత్యం ప్రజల్లో ఉండే రాజకీయ నాయకులకు సైతం కరోనా వస్తూండటంతో.. బయటకి రావడానికే భయపడుతున్నారు.

తాజాగా ఇప్పుడు మరో మంత్రికి కూడా కోవిడ్ సోకింది. మహారాష్ట్ర మంత్రి అస్లాం షేక్‌కు కోవిడ్ పాజిటివ్‌ నిర్థారణ అయింది. ఆదివారం మంత్రికి ఈ వైరస్ టెస్టులు చేయగా.. కరోనా సోకినట్లు ఈ రోజు ఉదయం రిపోర్టులు వచ్చాయి. అయితే అస్లాం షేక్‌కు కోవిడ్ లక్షణాలు లేకపోవడంతో హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు.

దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులతో మొదటి స్థానంలో ఉంది మహారాష్ట్ర. అలాగే మరణాల సంఖ్య కూడా 10 వేలు దాటింది. ప్రస్తుం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,10,455గా ఉంది. ఇక ఇప్పటివరకూ మహారాష్ట్ర వ్యాప్తంగా 11,854 మంది మృతి చెందారు.

Latest Articles