World Wide Covid 19: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టించిన కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఓ వైపు రోజు రోజుకీ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.. మరోవైపు మరణ మృదంగం మోగిస్తోంది. మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతూనే పోతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 21 లక్షలను దాటాయి. ఈ వైరస్ ఉధృతిని నివారించడంలో వ్యాప్తిని అరికట్టడంలో మరణాలకు అడ్డుకట్ట వేయడంలో అగ్రదేశాలు సైతం చేతులు ఎత్తేశాయి. బ్రిటన్, జర్మనీ, హాంకాంగ్‌లోని కోలూన్ ప్రాంతంలో లాక్‌డౌన్ విధించింది.
భారత్ సహా అనేక దేశాల్లో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతోంది. అయినప్పటికీ- కరోనా తీవ్రత ఎప్పట్లాగే కొనసాగుతోంది. ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి 21,30,647 మంది చనిపోయారు. పాజిటివ్ కేసుల సంఖ్య పది కోట్లకు చేరువ అవుతోంది. ఇప్పటిదాకా 9,93,38,910కేసులు నమోదు అయ్యాయి.
అమెరికాలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఆరంభమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజు రోజుకీ భారీ సంఖ్యలో పాజిటివ్ కేసుల సంఖ్య నమోదవుతుంది. మరోవైపు మరణాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి.
ఓ వైపు కరోనా వైరస్ కంగారు పెడుతుంటే.. మరో వైపు స్ట్రెయిన్ భయబ్రాంతులకు గురించేస్తుంది. ఇప్పటికే పలు దేశాలలో గుర్తించారు వైరాలజీ నిపుణులు. కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్.. ఎప్పటికప్పుడు పరివర్తన చెందుతుండగా.. ఇది ఇతర వైరస్‌ల కంటే ఎక్కువ సులభంగా వ్యాపిస్తుందని అంటున్నారు.
Also Read: ఈ బాలుడు ఎక్కడ ఉన్నాడో తెలిస్తే చెప్పండి.. ప్రోత్సహిస్తే తప్పక ఒలంపిక్ పతకాన్ని తెస్తాడన్న కేటీఆర్