ప్రపంచవ్యాప్తంగా భారీగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి.. కొత్తగా నమోదైన కేసులు, మరణాలు ఎన్నంటే..?

|

Feb 24, 2021 | 10:59 AM

International Covid-19 cases Updates: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏడాది గడిచినప్పటికీ.. ప్రతీ రోజూ నమోదయ్యే పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య..

ప్రపంచవ్యాప్తంగా భారీగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి.. కొత్తగా నమోదైన కేసులు, మరణాలు ఎన్నంటే..?
Follow us on

International Covid-19 cases Updates: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏడాది గడిచినప్పటికీ.. ప్రతీ రోజూ నమోదయ్యే పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య మాత్రం నిత్యం పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,71,151 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 11,26,54,146 దాటింది. గడిచిన 24 గంటల్లో ఈ మహమ్మారి కారణంగా 10,267 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,496,749 కు దాటింది. ఇప్పటివరకు కరోనా నుంచి 88,239,672 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 2.19 కోట్లకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇదిలాఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల్లో అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇండియా , బ్రెజిల్, రష్యా, బ్రిటన్ ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. మొత్తం మరణాల్లో కూడా అమెరికానే అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో బ్రెజిల్, మెక్సికో, ఇండియా, బ్రిటన్ కొనసాగుతున్నాయి.

Also Read:

దేశవ్యాప్తంగా మరోసారి గుబులు పుట్టిస్తున్న క‌రోనా మ్యుటేషన్‌… పెరుగుతున్న పాజిటివ్ కేసులు..!

దేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్ల గుర్తింపు.. నిర్లక్ష్యం వహిస్తే దాడికి రెడీ.. అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు