Covid19 Vaccine: కరోనా కట్టడికి మరో వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి.. వ్యాక్సిన్ జాబితాలో “మోడెర్నా” కు చోటు

|

May 01, 2021 | 9:06 AM

క‌రోనా వైర‌స్ నియంత్రణ కోసం ఫార్మా దిగ్గజ సంస్థలు మోడెర్నా డెవలప్ చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ అత్యవ‌స‌ర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్ లిస్ట్‌లో చేర్చింది.

Covid19 Vaccine: కరోనా కట్టడికి మరో వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి.. వ్యాక్సిన్ జాబితాలో మోడెర్నా కు చోటు
Moderna Covid Vaccine
Follow us on

Moderna Vaccine: క‌రోనా వైర‌స్ నియంత్రణ కోసం ఫార్మా దిగ్గజ సంస్థలు మోడెర్నా డెవలప్ చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ అత్యవ‌స‌ర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్ లిస్ట్‌లో చేర్చింది. కరోనాకు వ్యతిరేకంగా పోరాడేందుకు మోడెర్నా వ్యాక్సిన్‌ లిస్ట్‌ చేసినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. వ్యాక్సిన్‌ సమర్థతను మదింపు చేయలేని దేశాలు సాధ్యమైనంత త్వరగా వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. అలాగే కోవాక్స్ వ్యాక్సిన్ షేరింగ్ స్కీమ్, పేద దేశాలకు పంపిణీ చేయడానికి సహాయపడుతుందని తెలిపింది. ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నాలుగు టీకాలను లిస్ట్‌ చేయగా.. మోడెర్నా టీకా ఐదవది. అమెరికాలో అత్యవసర వినియోగానికి ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ గతేడాది డిసెంబర్‌ 18న మోడెర్నా టీకాకు అనుమతి జారీ చేసింది.

అలాగే, యూరోపియన్‌ యూనియన్‌లో చెల్లుబాటయ్యేలా యూరోపియన్‌ యూనియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ ఈ ఏడాది జనవరి 6న మార్కెటింగ్‌కు అనుమతులు మంజూరు చేసింది. వ్యాక్సిన్‌ 94.1 శాతం సామర్థ్యం కలిగి ఉందని స్ట్రాటజిక్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆఫ్‌ ఇక్స్‌పర్ట్స్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ (ఎస్‌జీఈ) గుర్తించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇదిలా ఉండగా.. 2022 నాటికి ఐరోపా, యూఎస్‌లో మూడు బిలియన్‌ మోతాదులను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నట్లు మోడెర్నా కంపెనీ పేర్కొంది.

Read Also…  ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్సకు ధరలు ఫిక్స్..