జీఎస్టీ చెల్లింపుదారులకు కేంద్రం గుడ్ న్యూస్

|

Jul 01, 2020 | 6:30 AM

దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను అమల్లోకి వచ్చి ఈ రోజుతో సరిగ్గా మూడేళ్లు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2017 జూలై 1న జీఎస్టీని తీసుకొచ్చింది. దీంతో బుధవారం మూడో జీఎస్టీ డే వేడుకలను నిర్వహించనున్నట్టు హైదరాబాద్‌ సెంట్రల్‌ జీఎస్టీ జోన్‌ చీఫ్‌ కమిషనర్‌ మల్లికా ఆర్యా ప్రకటించారు. ఇందులో భాగంగా జోన్‌ పరిధిలో ఉత్తమ సేవలందించిన 10 మంది అధికారులకు ప్రశంసా పత్రాలు అందిస్తామని చెప్పారు. కాగా, కరోనా వైరస్‌ నేపథ్యంలో వేడుకలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా […]

జీఎస్టీ చెల్లింపుదారులకు కేంద్రం గుడ్ న్యూస్
Follow us on

దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను అమల్లోకి వచ్చి ఈ రోజుతో సరిగ్గా మూడేళ్లు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2017 జూలై 1న జీఎస్టీని తీసుకొచ్చింది. దీంతో బుధవారం మూడో జీఎస్టీ డే వేడుకలను నిర్వహించనున్నట్టు హైదరాబాద్‌ సెంట్రల్‌ జీఎస్టీ జోన్‌ చీఫ్‌ కమిషనర్‌ మల్లికా ఆర్యా ప్రకటించారు. ఇందులో భాగంగా జోన్‌ పరిధిలో ఉత్తమ సేవలందించిన 10 మంది అధికారులకు ప్రశంసా పత్రాలు అందిస్తామని చెప్పారు. కాగా, కరోనా వైరస్‌ నేపథ్యంలో వేడుకలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహిస్తామని వెల్లడించారు.

ఆగస్టు 31వరకు జీఎస్టీ రిటర్నులు..

ఇదిలావుంటే… దేశవ్యాప్తంగా కొవిడ్-19 విజృంభిస్తున్న తరుణంలో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ చెల్లింపుదారులు దాఖలు చేయాల్సిన దాదాపు అన్ని రిటర్నుల గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. ఈ మేరకు పలు జీఎస్టీ రిటర్నుల దాఖలు గడువును పొడిగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి.