కోవిడ్ జయించి.. పాస్ల్మా దానం చేయడానికి వస్తున్న ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. ఇప్పటి వరకూ సైబరాబాద్ కమీషనర్ రేట్ పరిధిలో అనేక మందితో రక్త దానం శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇలాంటి వారిని స్పూర్తిగా తీసుకుని మరికొంత మంది ముందుకు రావాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. పది రోజుల్లో మేము 160 మందికి ప్లాస్మా దానం చేశాం. అలాగే మాదాపూర్, బాలానగర్ ప్రాంతాల్లో ఆంబులెన్స్ సేవలు ఏర్పాటు చేశాం. ప్రజలు వినియోగించుకోండి. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ప్లాస్మా దానం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.
అలాగే ప్లాస్మా దానంపై ముందుకు రావాలంటూ టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవర కొండ కూడా పిలుపునిచ్చాడు. మా ఫ్రెండ్ ఫాదర్‌కి కరోనా వైరస్ రావడంతో మాకు ప్లాస్మా అవసరం. కోవిడ్ వచ్చి.. దాని నుంచి కోలుకున్నవారు ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయండి. ప్లాస్మా దానం చేయడం ద్వారా చాలా మంది కుటుంబాలకు మీరు అండగా ఉండిన వారవుతారు. నాకు కరోనా వస్తే నేను కరోనా జయించి ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు విజయ్ దేవరకొండ.
Donate Plasma and save lives.https://t.co/vtBMhOypFq
Hero @TheDeverakonda urges people who have recovered from #Covid19 to donate Plasma.
He felicitated Plasma Donors today and unveiled a campaign poster@cyberabadpolice @cpcybd #VijayDeverakonda pic.twitter.com/lkxf2Afqsc
— BARaju (@baraju_SuperHit) July 31, 2020
Read More:
‘దావూద్ ఇబ్రహీం’ బయోపిక్‌ను తీయనున్న యాత్ర డైరెక్టర్..
ఆగష్టు 1 నుంచి మారే న్యూ రూల్స్ ఇవే..
‘సచిన్ కూతురు సారా’, ‘క్రికెటర్ శుభ్ మాన్ గిల్’ మధ్య ఏం జరుగుతోంది?
ప్రముఖ నటుడు శరత్ కుమార్‌కి షాక్.. ఫోన్ హ్యాక్ చేసి బెదిరింపులు..