కరోనా వైరస్‌తో ప్రస్తుతం ప్రపంచమంతా వణికిపోతుంది. ప్రస్తుతం ఈ వైరస్‌కి ఇంకా వ్యాక్సిన్ రాకపోవడంతో.. దీన్ని కట్టడి చేసేందుకు ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సామాన్యుడు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఈ వ్యాధి పేరు చెబుతుంటే అందరూ వణికిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడ్డారు. అలాగే కోవిడ్ నుంచి రక్షణ పొందటానికి ప్రజలందరూ తప్పకుండా మాస్కులు ధరించాల్సి వస్తుంది. ఈ సమయంలో అందరినీ ఆకర్షించేలా తెలుగు యంగ్ హీరో రామ్ కూడా ఓ సరికొత్త టిప్ చెప్పాడు.
వీడియోలో ‘సూపర్ మ్యాన్ లాంటి డ్రెస్ వేసుకుని.. తనని తాను వైరస్ నుంచి ఎలా రక్షణ పొందుతున్నాడో చెప్పాడు రామ్. ఇలాగే అందరూ జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చాడు’. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇలా చేస్తే.. కరోనా కాదు కదా.. దాని తాత కూడా ఎవర్నీ ఏమీ చేయదని సరదాగా జోక్స్ వేస్తున్నారు. అయితే మరి ఇప్పుడు రామ్ స్టైల్‌ని ఎంత మంది ఫాలో అవుతారో చూడాలి.
Never give up attitude with 2020 Modulation.. Full of precautions in doing everything.. #RAPO @ramsayz #RamPothineni #EnergiticStar #iSmartRAM pic.twitter.com/C22HvLoV8k
— Clapnumber (@clapnumber) June 27, 2020