‘అమెజాన్ ప్రైమ్’, ‘నెట్ ఫ్లిక్స్’ లాంటి ఓటీటీల రాకతో వెబ్‌సిరీస్‌లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. అందులోనూ ఇప్పుడు కోవిడ్ మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమకు చాలా నష్టం కలిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది నిర్మాతలు, తమ సినిమాలను ఓటీటీల ద్వారా విడుదల చేయడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పటికే సమంత ‘ద ఫ్యామిలీ మ్యాన్-2’లో చేయగా, కాజల్ అగర్వాల్, తమన్నా వంటి స్టార్ హీరోయిన్స్ కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు మరో ఇద్దరు హీరోయిన్స్ కలిసి ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారట. తమిళ్ వెబ్ సిరీస్‌లో నటించడానికి వరలక్ష్మీ శరత్ కుమార్, ఐశ్వర్య రాజేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. అయితే ఇందులో వీరిద్దరూ సవతులుగా నటించనున్నరని టాక్ నడుస్తోంది. మరి ఇందులో హీరో ఎవరనేది ఇంకా ఫిక్స్ కాలేదు. ఎమోషనల్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్‌గా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కబోతుందని సమాచారం. దీన్ని డైరెక్టర్ సూర్య సుబ్రమణ్యన్ తెరకెక్కిస్తుండగా, ఆనంద్ వికటన్ సంస్థ నిర్మిస్తుంది.
Read More:
రేణు దేశాయ్ సంచలన నిర్ణయం.. లగ్జరీ కార్లు అమ్మేసి!
‘కరోనా’ అనుభవాలు మనకు పాఠం నేర్పాయిః సీఎం కేసీఆర్
క్షీణించిన ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం! మరో ఆస్పత్రికి తరలింపు