ఇకపై రోడ్డు మీదకొస్తే.. ఇలా పట్టుకుంటారు

| Edited By:

Apr 12, 2020 | 1:56 PM

కరోనా వైరస్‌‌ను కట్టడి చేయడానికి భారత దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయినా కూడా కొంతమంది లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. అలాంటి వారి ఆటలను కట్టడి చేయడానికి గుజరాత్‌లోని వడోదర నగరం అధికారులు ఆధునిక టెక్నాలజీని..

ఇకపై రోడ్డు మీదకొస్తే.. ఇలా పట్టుకుంటారు
Follow us on

కరోనా వైరస్‌‌ను కట్టడి చేయడానికి భారత దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయినా కూడా కొంతమంది లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. అలాంటి వారి ఆటలను కట్టడి చేయడానికి గుజరాత్‌లోని వడోదర నగరం అధికారులు ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎవరు నిబంధనలు ఉల్లంఘిస్తారో తెలుసుకోనేందుకు కెమెరాలతో కూడిన హీలియమ్ బెలూన్లను రంగంలోకి దించారు. గాల్లో ఎగిరే ఈ బెలూన్ల సాయంతో ప్రజలపై గట్టి నిఘా పెట్టనున్నారు. ఎవరు రోడ్ల మీదకు వస్తారో వారిని బెలూన్‌లో ఉన్న కెమెరాలు ఫొటోలు తీస్తాయి. దీంతో వారిని గుర్తించి శిక్షించనున్నారు అధికారులు. ప్రస్తుతం అక్కడ కరోనా కేసులు పెరుగుతోన్న కారణంగా స్థానిక ప్రభుత్వాదికారులు వడోదర నగరాన్ని నాలుగు జోన్లుగా విభజించారు. రెడ్ జోన్‌లో కంటెయిన్‌మెంట్ నిబంధనలను అమలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రెడ్‌జోన్‌లోని టండాల్జా ప్రాంతంపై నిఘా పెంచేందుకు కెమెరాలతో ఉన్న రెండు హీలియం బెలూన్లను రంగంలోకి దింపారు అధికారులు. వీటిలో ప్రజలకు అప్పటికప్పుడు సూచనలు చేసేందుకు వీలుగా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌ని కూడా సిద్ధం చేశారు. దీంతో అధికారులు ఎక్కడి నుంచైనా సరే కేవలం మొబైల్ ఫోన్లో స్థానికంగా ఉన్న పరిస్థితిని తెలుసుకోవచ్చు. టండాల్జా ప్రాంతంతో పాటు నగర్వాడా ప్రాంతాన్ని కూడా రెడ్ జోన్‌లో చేర్చారు. కేంద్రం ప్రకటించిన కంటెయిన్‌మెంట్ నిబంధనలు అక్కడ అమలు చేస్తున్నారు. ఎటువంటి రాకపోకలకు ఆస్కారం లేకుండా ఈ జోన్ మొత్తాన్ని అధికారులు మూసివేశారు. ఇంటింటికీ వైద్య సిబ్బంది వెళ్లి కుటుంబ సభ్యుల ఆరోగ్య స్థితిగతులను గమనిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ఫ్లాష్‌న్యూస్: ఏప్రిల్ 30 వరకూ రాష్ట్రంలో లాక్‌డౌన్‌

జబర్దస్త్ నుంచి వాళ్లిద్దరినీ తప్పించనున్న మల్లెమాల టీం?

ఫేస్‌బుక్ వ్యసనానికి.. ఫేస్‌బుక్కే మందు కనిపెట్టింది

లాక్ డౌన్‌పై మనసులో మాట బయటపెట్టిన జగన్..!