Breaking: కరోనా వ్యాక్సిన్ రెడీ.. నేడే తొలి క్లినికల్ ట్రయల్..!

| Edited By: Ravi Kiran

Mar 16, 2020 | 11:26 AM

ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా వైరస్‌(కొవిడ్‌-19)ను అంతమొందించేందుకు జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు నడుం బిగించారు. ఈ వైరస్‌ పనిపట్టేలా మందును తయారు చేయడంలో తలమునకలయ్యారు

Breaking: కరోనా వ్యాక్సిన్ రెడీ.. నేడే తొలి క్లినికల్ ట్రయల్..!
Follow us on

ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా వైరస్‌(కొవిడ్‌-19)ను అంతమొందించేందుకు జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు నడుం బిగించారు. ఈ వైరస్‌ పనిపట్టేలా మందును తయారు చేయడంలో తలమునకలయ్యారు. అందులో భాగంగా తయారుచేసిన ఓ వ్యాక్సిన్‌ను నేడు తొలిసారి ప్రయోగించనున్నారు. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.

కాగా కరోనాకు వ్యాక్సిన్‌ కోసం సియాటెల్‌లోని వాషింగ్టన్‌ హెల్త్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పరిశోధనలు జరగుతున్నాయి. వాటికి సంబంధించిన నిధులను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ ఇస్తోంది. అయితే ఈ వ్యాక్సిన్‌ పనితీరును పూర్తిస్థాయిలో ద్రువీకరించడానికి మరో 18 నెలలు వేచిచూడక తప్పదని అక్కడి పబ్లిక్‌ హెల్త్‌ అధికారులు తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ను వేయించుకునేందుకు స్వచ్చదంగా ముందుకు వచ్చే 45 మంది యువకులపై ప్రయోగిస్తారు. వీరికి ఒక్కొక్కరికి ఒక్కో పరిమాణంలో వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ వలన ఎలాంటి ప్రమాదం ఉండదని.. లోతైన పరీక్షలు చేసేందుకు ముందు చేసే ప్రయోగం మాత్రమేనని పేర్కొన్నారు. మున్ముందు ఎలాంటి దుష్ఫరిణామాలు ఉంటాయో తెలుసుకునే అవకాశం దీని వలన కలుగుతుందని అధికారులు తెలిపారు. ఆధునిక సాంకేతికతో షాట్స్ విధానంలో వీటిని అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 6,516కు చేరింది. భారత్‌లోనూ రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది.

Read This Story Also: టీడీపీకి పరిటాల ఫ్యామిలీ గుడ్‌బై.. శ్రీరామ్ ఏమన్నారంటే..!