షాకింగ్.. సీఎం వ్యక్తిగత వైద్యుడికి పాజిటివ్.. టెన్షన్‌లో అధికారులు..

| Edited By:

Jun 20, 2020 | 7:42 PM

కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. అన్‌లాక్‌ 1.0 ప్రారంభమైనప్పటి నుంచి.. దేశంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. పేద, ధనిక అన్న తేడా లేకుండా..

షాకింగ్.. సీఎం వ్యక్తిగత వైద్యుడికి పాజిటివ్.. టెన్షన్‌లో అధికారులు..
Follow us on

కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. అన్‌లాక్‌ 1.0 ప్రారంభమైనప్పటి నుంచి.. దేశంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. పేద, ధనిక అన్న తేడా లేకుండా.. అన్ని వర్గాల వారిని ఇది టచ్ చేస్తోంది. తాజాగా.. ఉత్తరాఖండ్‌ సీఎం వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎన్‌ఎస్ బిష్త్‌కు శనివారం నాడు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ఎవరెవర్ని కలిశారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాంటాక్ట్ కేసులను అన్నింటిని త్వరగానే గుర్తించి.. పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్‌ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

మరోవైపు శుక్రవారం నాడు రాష్ట్రంలో నలుగురు వైద్యులకు కరోనా సోకింది. అంతేకాదు.. మరో 17 మంది సిబ్బందికి కూడా పాజిటివ్‌గా తేలింది. వీరు డూన్ ఆస్పత్రిలో సిబ్బందిగా తెలుస్తోంది. ఇదిలావుంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,177 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ప్రస్తుతం 718 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. 1,433 మంది
కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా.. కరోనా బారినపడి 26 మంది మరణించారని అధికారులు తెలిపారు.