కరోనా మహమ్మారి ప్రజాప్రతినిధులను వదలడం లేదు. ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఇదిలావుంటే.. మరో కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్‌కు కూడా కరోనా సోకినట్లు పరీక్షల్లో తేలింది. దీంతో వెంటనే ఆయన చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. కరోనా పరీక్షలు రెండు సార్లు చేయించుకున్నానని.. ఇందులో రెండో సారి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు.
కాగా, అర్జున్ మేఘవాల్ మధ్య ప్రదేశ్‌లోని బికనేర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్పానే. ప్రస్తుతం ఆయన కేంద్ర భారీ పరిశ్రమలు, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు.
I tested positive for COVID-19 after testing negative for the disease. My health is fine but I am admitted to AIIMS on doctors’ advice: Arjun Ram Meghwal, Union Minister of State for Parliamentary Affairs pic.twitter.com/6MzcQIA4CV
— ANI (@ANI) August 8, 2020
Read More :