Strain Virus: ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న స్ట్రెయిన్ వైరస్.. ఇప్పటి వరకు యూకే నుంచి ఎంతమంది వచ్చారంటే..

|

Dec 28, 2020 | 5:54 PM

కరోనా రూపాంతరమైన స్ట్రెయిన్ వైరస్ ఆంధ్రప్రదేశ్‌ని వణికిస్తోంది. దాంతో యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం..

Strain Virus: ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న స్ట్రెయిన్ వైరస్.. ఇప్పటి వరకు యూకే నుంచి ఎంతమంది వచ్చారంటే..
Follow us on

Strain Virus: కరోనా రూపాంతరమైన స్ట్రెయిన్ వైరస్ ఆంధ్రప్రదేశ్‌ని వణికిస్తోంది. దాంతో యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం పక్కా నిఘా పెడుతోంది. వారి కదలికలను నిరంతరం ట్రేస్ చేస్తోంది. తాజాగా యూకేలో స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తిలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు యూకే నుంచి 1346 మంది రాష్ట్రానికి తిరిగి వచ్చారు. వీరిలో 1324 మందిని గుర్తించిన ప్రభుత్వం వారందరినీ క్వారంటైన్‌కు తరలించింది. 17 మందిని ఇంకా ట్రేస్ చేస్తున్నారు. కాగా, యూకే నుంచి వచ్చిన వారిలో 11 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఇది స్ట్రెయిన్ వైరసా.. లేక కోవిడ్ వైరసా అని తేల్చేందుకు సంబంధిత శాంపిల్స్‌ను పుణెలోని ఎన్ఐవీ, సీసీఎంబీ ల్యాబ్‌కు పంపిచాంరు అధికారులు.

ఇక, యూకే నుంచి వచ్చిన వారు రాష్ట్రంలో 5784 మందితో కాంటాక్ట్ అయినట్లు అధికారులు గుర్తించారు. వీరందిరినీ గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఇక యూకే నుంచి వచ్చిన వారితో కాంటాక్ట్ అయిన వారిలో 12 మంది కరోనా బారిన పడినట్లు అధికారులు ధృవీకరించారు. వీరిలో గుంటూరుకు చెందిన వారు 8 మంది ఉండగా, ఈస్ట్ గోదావరి 3, నెల్లూరు ఒక్కరు చొప్పున బాధితులు ఉన్నారు.

 

Also read:

Farmers protest: రైతుల ఆందోళన.. రైతు సంఘాలను మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం

Anti cow slaughter Bill: గోవధ నిషేధ ఆర్డినెన్స్‌ను ఆమోదించిన కర్ణాటక కేబినెట్.. ఇదే బాటలో మరిన్ని రాష్ట్రాలు