ఫిలిప్పిన్స్‌లో తెలుగు విద్యార్థులు మృతి

|

Apr 07, 2020 | 10:34 AM

ఫిలిప్పిన్స్‌లో ఇద్ద‌రు తెలుగు విద్యార్థులు మృతిచెందారు. స్థానిక‌ సీఈబీయూ యూనివ‌ర్శిటీలో మెడిసిన్ చేస్తున్న ఇద్ద‌రు విద్యార్థులు ఒకే రూంలో అద్దెకు ఉంటూ చ‌దువుకుంటున్నారు...

ఫిలిప్పిన్స్‌లో తెలుగు విద్యార్థులు మృతి
Follow us on
ఫిలిప్పిన్స్‌లో ఇద్ద‌రు తెలుగు విద్యార్థులు మృతిచెందారు. స్థానిక‌ సీఈబీయూ యూనివ‌ర్శిటీలో మెడిసిన్ చేస్తున్న ఇద్ద‌రు విద్యార్థులు ఒకే రూంలో అద్దెకు ఉంటూ చ‌దువుకుంటున్నారు. క‌రోనా నేప‌థ్యంలో లాక్‌డౌన్ కార‌ణంగా తెల్ల‌వారుజామున టూవీల‌ర్‌పై నిత్యావ‌స‌రాల కోసం బ‌య‌ట‌కు వెళ్లారు. ఎదురుగా వ‌స్తున్న వాహ‌నాల లైటింగ్‌కు రోడ్డు ప‌క్క‌నే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్ట‌డంతో ప్ర‌మాదం జ‌రిగింది. దీంతో ఇద్ద‌రూ అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మృతులు ఏపీలోని అనంత‌పురం జిల్లా వాసులుగా గుర్తించిన అధికారులు,…త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం అందించారు.
విద్యార్థుల మ‌ర‌ణ‌వార్త‌పై సోమవారం వారి తల్లిదండ్రులకు సమాచారం అందింది.. అయితే ఇద్దరి మృతదేహాలను సొంత ఊళ్లకు తరలించేందుకు కరోనా ఎఫెక్ట్, లాక్‌డౌన్ అడ్డంకిగా మారింది. విద్యార్థుల మరణ వార్త తెలియడంతో తల్లిదండ్రులు క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు. వారి మృతదేహాలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.
విద్యార్థుల మృతితో వారి స్వ‌గ్రామాల్లోనూ విషాదం నెల‌కొంది. ఇటు ఇద్దరు విద్యార్థుల మృతి, డెడ్‌బాడీలను సొంత ఊళ్లకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగశాఖకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాసిన‌ట్లుగా తెలుస్తోంది. వారి వివరాలను లేఖలో ప్రస్తావించారు. దీనిపై ఫిలిప్పిన్స్‌లో ఇండియన్ ఎంబసీ స్పందించింది.. తగిన చర్యలు తీసుకుంటామని స్ప‌ష్టం చేసింది.