AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా టెర్ర‌ర్‌.. ఏపీలో అత్య‌ధికంగా!

ముందుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌య‌నికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9742 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,16,003కు చేరింది. ఇందులో 86,725 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,26,372 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్..

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా టెర్ర‌ర్‌.. ఏపీలో అత్య‌ధికంగా!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 20, 2020 | 7:23 AM

Share

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గ‌త కొన్ని నెల‌లుగా కరోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా విజృంభించిన విష‌యం తెలిసిందే. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య ఓ రేంజ్‌లో న‌మోదు అయ్యేవి. అయితే గ‌త కొద్ది రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త‌ త‌గ్గిపోయాయి. కానీ ఒక్కో రోజు మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయి. ముందుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌య‌నికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9742 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,16,003కు చేరింది. ఇందులో 86,725 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,26,372 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే రాష్ట్రంలో మృతుల సంఖ్య 2906కు చేరింది. అటు గడిచిన 24 గంటల్లో 8061 మంది కరోనాను జయించారు.

ఇక జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 1123, చిత్తూరులో 830, తూర్పు గోదావరిలో 1399, గుంటూరులో 555, కడపలో 673, కృష్ణాలో 281, కర్నూలులో 794, నెల్లూరులో 755, ప్రకాశంలో 585, శ్రీకాకుళంలో 565, విశాఖలో 835, విజయనగరంలో 428, పశ్చిమ గోదావరిలో 919 కేసులు నమోదయ్యాయి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2461, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 434 కేసులు నమోదయ్యాయి.

ఇక తెలంగాణ విష‌యానికొస్తే.. క‌రోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్త‌గా మరో 1763 మంది క‌రోనా బారిన ప‌డ్డారు. 8 మంది వైర‌స్ కార‌ణంగా ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం ఇప్ప‌టివ‌ర‌కూ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 95,700కు చేరింది. అలాగే 719 మంది కోవిడ్ మ‌హ‌మ్మారి బారిన ప‌డి మ‌ర‌ణించారు. అలాగే ప్ర‌స్తుతం 20,990 యాక్టీవ్ కేసులు ఉండ‌గా, 73,991 మంది ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా డెత్ రేటు 0.75 శాతంగా ఉంది. దేశంలో ఇది 1.92 శాతంగా ఉందని గవ‌ర్న‌మెంట్ తెలిపింది. కాగా ఇప్పటి వరకు 7,97,470 కరోనా నిర్ధారణ టెస్టులు చేసిన‌ట్లు అధికారులు తెలిపారు.

Follow Us
అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన క్లాస్ ప్లేయర్..!
అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన క్లాస్ ప్లేయర్..!
సీనియర్ నటి లక్ష్మీ కూతురు తెలుగులో తిరుగులేని నటి..!
సీనియర్ నటి లక్ష్మీ కూతురు తెలుగులో తిరుగులేని నటి..!
రోడ్డు ప్రమాద పరిహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
రోడ్డు ప్రమాద పరిహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
ఆ బౌలర్ అంటే బుడ్డోడికి తెగ భయం.. చూస్తేనే సుస్సుపడిపోద్ది
ఆ బౌలర్ అంటే బుడ్డోడికి తెగ భయం.. చూస్తేనే సుస్సుపడిపోద్ది
మీ ఆత్మీయ మిత్రులకు పంపేందుకు కోట్స్, బెస్ట్ తెలుగు విషెస్
మీ ఆత్మీయ మిత్రులకు పంపేందుకు కోట్స్, బెస్ట్ తెలుగు విషెస్
యూరప్‌ను వణికిస్తున్న కార్చిచ్చులు..!
యూరప్‌ను వణికిస్తున్న కార్చిచ్చులు..!
ఒడిదుడుకులను తట్టుకోవడానికి హైబ్రిడ్ ఇటిఎఫ్‌లు ఎలా ఉపయోగపడతాయి?
ఒడిదుడుకులను తట్టుకోవడానికి హైబ్రిడ్ ఇటిఎఫ్‌లు ఎలా ఉపయోగపడతాయి?
టీమిండియా వెనుక రియల్ హీరో ఇతనే.. నెలకు రూ.100 తో మొదలై
టీమిండియా వెనుక రియల్ హీరో ఇతనే.. నెలకు రూ.100 తో మొదలై
సైలెంట్ కిల్లర్స్..మీ మెదడును దెబ్బతీస్తున్న ప్రమాదకర అలవాట్లు!
సైలెంట్ కిల్లర్స్..మీ మెదడును దెబ్బతీస్తున్న ప్రమాదకర అలవాట్లు!
పాలు, పండ్లు కన్నా 5 రెట్లు ఎక్కువ.. తింటే యవ్వనం రివర్స్
పాలు, పండ్లు కన్నా 5 రెట్లు ఎక్కువ.. తింటే యవ్వనం రివర్స్