హిమాచల్ ప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారినపడుతున్నారు. తాజాగా రాష్ట్ర సీఎం జై రాం ఠాకూర్ సిబ్బందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. సీఎం ఆఫీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ గన్‌మెన్‌తో పాటుగా.. పైలట్ వాహానానికి చెందిన ఓ డ్రైవర్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇక కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం.. హిమాచల్ ప్రదేశ్‌లో గురువారం నాటికి 1,256 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More :
రాజస్థాన్‌లో తాజాగా మరో 608 పాజిటివ్ కేసులు