బ్రేకింగ్‌.. కరోనాకు కేరాఫ్‌గా నిమ్స్‌ ఆస్పత్రి..

| Edited By:

Jun 17, 2020 | 6:23 PM

కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో విజృంభిస్తోంది. గత నెల రోజులుగా కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. గడిచిన వారం రోజులుగా రోజుకు వంద నుంచి రెండు వందలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

బ్రేకింగ్‌.. కరోనాకు కేరాఫ్‌గా నిమ్స్‌ ఆస్పత్రి..
Follow us on

కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో విజృంభిస్తోంది. గత నెల రోజులుగా కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. గడిచిన వారం రోజులుగా రోజుకు వంద నుంచి రెండు వందలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక ఈ మహమ్మారి వైరస్ వైద్యులను, వైద్య సిబ్బందిని కూడా వదలడం లేదు. ఇప్పటికే ఉస్మానియా, గాంధీ ఆస్పత్రికి చెందిన పలువురు వైద్య సిబ్బంది కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఇక పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలోని వైద్యులకు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. 26 మంది వైద్యులతో పాటు.. 40 మంది సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ తేలడంతో.. యూరోలజీ, ఇండోక్రోనాలజీ, కార్డియాలజీ, సర్జికల్‌, ఇండోస్కోపిక్‌ విభాగాలు మూతపడ్డాయి. అయితే తాజాగా బుధవారం నాడు ఇద్దరు ప్లాస్టిక్‌ సర్జన్స్‌కు కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడి సిబ్బంది కరోనా భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే మిలినియం బ్లాక్‌లో కరోనా బాధితులు ఉన్నారు. మరో 40 బెడ్స్‌ను ఐపీఎంఆర్‌ బిల్డింగ్‌లో రెడీ చేశారు నిమ్స్‌ యాజమాన్యం.