శ్రామిక్ రైళ్లపై ఉధ్ధవ్ థాక్రే, పీయూష్ గోయల్ మధ్య ట్విటర్ వార్

| Edited By: Pardhasaradhi Peri

May 25, 2020 | 12:27 PM

వలస కూలీల తరలింపునకు అవసరమైనన్ని రైళ్లను రైల్వే శాఖ సమకూర్చడం లేదని మహారాష్ట్రలో ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం ఈ శాఖపై ఆరోపణలు చేయడంతో రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ రాష్ట్రం నుంచి 125శ్రామిక్ రైళ్లను నడపడానికి మేము సిధ్దంగా ఉన్నామని, కానీ మీరే ప్యాసింజర్ల లిస్టును ఇవ్వడంలేదని ఆయన హిందీలోనూ, ఇంగ్లీషులోను వరుసగా ఆరు ట్వీట్లు చేశారు. నిన్న తెల్లవారు జామున రెండు గంటల వరకు కూడా మాకు కేవలం 45 […]

శ్రామిక్ రైళ్లపై ఉధ్ధవ్ థాక్రే, పీయూష్ గోయల్ మధ్య ట్విటర్ వార్
Follow us on

వలస కూలీల తరలింపునకు అవసరమైనన్ని రైళ్లను రైల్వే శాఖ సమకూర్చడం లేదని మహారాష్ట్రలో ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం ఈ శాఖపై ఆరోపణలు చేయడంతో రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ రాష్ట్రం నుంచి 125శ్రామిక్ రైళ్లను నడపడానికి మేము సిధ్దంగా ఉన్నామని, కానీ మీరే ప్యాసింజర్ల లిస్టును ఇవ్వడంలేదని ఆయన హిందీలోనూ, ఇంగ్లీషులోను వరుసగా ఆరు ట్వీట్లు చేశారు. నిన్న తెల్లవారు జామున రెండు గంటల వరకు కూడా మాకు కేవలం 45 రైళ్ల సమాచారం మాత్రమే అందింది. అందులో అయిదు  పశ్చిమ బెంగాల్. ఒడిశా రాష్ట్రాలకు సంబంధించినవని ఆయన పేర్కొన్నారు. కానీ ఉమ్ ఫున్ తుపాను కారణంగా ఆ రాష్ట్రాలకు రైళ్లను నడపజాలమన్నారు 125 రైళ్ల నిర్వహణకు మేము రెడీగా ఉన్నప్పటికీ మీ రాష్ట్రం నుంచి మాకు సహకారం అందడం లేదని పీయూష్ గోయల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మహారాష్ట్ర నుంచి ట్రెయిన్ షెడ్యూల్స్, ప్రయాణికుల వివరాలు పంపాలని ఆయన కోరారు.