కరోనా వైరస్‌తో టీవీ జర్నలిస్ట్ మృతి..

తమిళనాడులో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. తాజాగా రాష్ట్రంలో ఓ వీడియో జర్నలిస్ట్ వైరస్ కాటుకు బలయ్యాడు. తమిళ్ ఛానెల్ రాజ్‌న్యూస్‌లో పని చేస్తున్న సీనియర్ వీడియో గ్రాఫర్.. కరోనాతో చికిత్స పొందుతూ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో...

కరోనా వైరస్‌తో టీవీ జర్నలిస్ట్ మృతి..

Updated on: Jun 28, 2020 | 3:22 PM

తమిళనాడులో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. తాజాగా రాష్ట్రంలో ఓ వీడియో జర్నలిస్ట్ వైరస్ కాటుకు బలయ్యాడు. తమిళ్ ఛానెల్ రాజ్‌న్యూస్‌లో పని చేస్తున్న సీనియర్ వీడియో గ్రాఫర్.. కరోనాతో చికిత్స పొందుతూ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో శనివారం రాత్రి కన్నుమూశాడు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న వీడియో జర్నలిస్ట్ జూన్ 14న ఆస్పత్రిలో చేరాడు. జర్నలిస్ట్ మృతి పట్ల తమిళనాడు సీఎం కే పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో పాటు పలువురు ప్రముఖులు, సహోద్యోగులు సంతాపం ప్రకటించారు.

తమిళ రాజ్ న్యూస్ ‌ఛానెల్‌లో సీనియర్ వీడియో గ్రాఫర్‌గా వేలుమురుగన్ పని చేస్తున్నాడు. ఆయన ఈ నెల 14న కరోనా లక్షణాలతో ఆస్ప్రతిలో చేరాడు. అయితే కరోనా తీవ్రత ఎక్కువ అవడంతో పరిస్థితి విషమించి చనిపోయాడు. దీంతో జర్నలిస్ట్ మృతి పట్ల తమిళనాడు సీఎంకే పళనిస్వామి సహా జర్నలిస్ట్ సంఘాలు సంతాపం ప్రకటించాయి.

Read More:

బ్రేకింగ్: గుజరాత్ మాజీ సీఎంకి కరోనా పాజిటివ్..

అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్.. నా కూతురికి భయపడి అలాంటి సినిమాలు..

Loading...
Unable to load recommendations.
Follow Us