
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతున్న నేపధ్యంలో విద్యుత్ నియంత్రణ మండలి వచ్చే నెలకు కరెంట్ మీటర్ రీడింగ్ నమోదును వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈలోపే తెలంగాణ ఉత్తర డిస్క్ం బిల్లుల చెల్లింపు విషయంలో సరికొత్త యాప్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని కసరత్తు చేస్తోంది. ఈ యాప్ ద్వారా ఎవరు ఇంటి మీటర్ ను వారు ఫోటో తీసి పంపితే బిల్లు జనరేట్ అవుతుందని డిస్క్ం సీఎండీ అన్నమనేని గోపాలరావు వెల్లడించారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీని దేశ రాజధాని ఢిల్లీలో ఉపయోగిస్తున్నారని అధికారులు అంటున్నారు. పాత బిల్లు వచ్చిన తేదీ దగ్గర నుంచి సరిగ్గా 30 రోజులకు మీటర్ ఫోటోను తీసి ఆన్ లైన్ ద్వారా పంపితే..బిల్లు వస్తుందని.. దాన్ని ఆన్లైన్‌లోనే చెల్లించవచ్చునని తెలిపారు.
యాప్ పని చేసే విధానం…
వినియోగదారులు యాప్‌ను తమ స్మార్ట్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకుని కరెంటు కనెక్షన్ నెంబర్, ఫోన్ నెంబర్ తదితర వివరాలు ఎంట్రీ చేయాలి. ఇక మీటర్ రీడింగ్‌ను నెలకోసారి ఫోటో తీసి అప్‌లోడ్ చేస్తే.. అది డిస్కంలకు చేరి ఎంత బిల్లు వస్తుందో తెలుసుకోవచ్చునని చెప్పారు.
Also Read:
కిమ్ కంటే యమ డేంజరట.. ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
జూన్ 1 వరకూ లాక్‌డౌన్.. సర్కార్ కీలక నిర్ణయం..
కరోనా వేళ.. పాక్‌కు గట్టి షాక్.. క్వారంటైన్‌కు ఇమ్రాన్ ఖాన్.!
డిగ్రీ విద్యార్ధులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..
కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ అగ్రస్థానం..
లాక్ డౌన్ వేళ.. అదిరిపోయే పబ్జీ కాంపిటీషన్.. ప్రో-ప్లేయర్స్ గెట్ రెడీ..
లాక్‌డౌన్ ఉల్లంఘించి పార్టీ చేసుకున్న గ్రామ వాలంటీర్లు..