Immunity Food: కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చిన వేళ పజల్లో ఆరోగ్యంపై అవగాహన బాగా పెరిగింది. ముఖ్యంగా తీసుకునే ఆహారం విషయంలో చాలా మార్పులు వచ్చాయి. కరోనా సోకకుండా కొత్త కొత్త ఆహార పదార్థాలను అలవరుచుకుంటున్నారు. ముఖ్యంగా కరోనాను కట్టడి చేయాలంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకోవాలనే విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే రోగనిరోధక శక్తిని పెంచుకునే ఆహారాన్ని తీసుకుంటున్నారు. పడగడుపున తీసుకునే కొన్నిఆహార పదార్థాల ద్వారా సహజంగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అందులో కొన్నిముఖ్యమైన వాటిపై ఓ లుక్కేయండి..
వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్‌ఫెక్షన్లను సహజంగా తగ్గిస్తాయి. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిని కూడా అదుపులో ఉంచుతుంది. ఉదయం లేవగానే రెండు వెల్లుల్లి ముక్కలను తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉసిరి కూడా ప్రధాన పాత్ర పోషిస్టుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరిలో ఎన్నో మంచి గుణాలున్నాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పడగడుపున తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా చర్మం, జుట్టు ప్రకాశవంతంగా మారుతుంది.
ఉదయం లేవగానే తెనేను కొంచెం వేడి నీటిలో కలుపుకొని తాగాలి. ఇది శరీర బరువు తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తి పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఇందులో కొంచెం నిమ్మ రసం కలుపుకుంటే మరిన్ని లాభాలు మీ సొంతం చేసుకోవచ్చు. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌పై క్రీయాశీలంగా పనిచేస్తోంది. యాంటీ బ్యాక్టీరియల్ రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది.
Also Read: CORONA VACCINE: రెండో డోసు ఎంత లేటైతే అంత మేలు.. అమెరికన్ సైంటిస్టుల తాజా అధ్యయనం ఫలితమిదే!
Chapatis At Night: రాత్రిపూట చపాతీలు తింటున్నారా.? అయితే మంచిదో.. కాదో.. తెలుసుకోండి.!
Radish: ముల్లంగిని ఈ నాలుగు ఆహార పదార్థాలతో తింటే.. విషంతో సమానం.. ఎందుకంటే..?