Homeopathy Medicine For Coronavirus: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపధ్యంలో అంతటా ఆందోళన నెలకొంది. ఈ విపత్కర పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. దీంతోపాటు మరికొన్ని వ్యాక్సిన్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళిక చేస్తున్నారు. ఈ క్రమంలో పలు అధ్యయనాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే.. కరోనా కట్టడికి హోమియోపతి వైద్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు పలు అధ్యయనాలు కూడా ఊపందుకున్నాయి. కాగా… ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్ వేదికగా హోమియోపతి పరిశోధన మొదలైంది. ప్రముఖ హోమియో వైద్యుడు డాక్టర్ మనోజ్ కురియకోస్ ఆధ్వర్యంలో పరిశోధన కొనసాగుతోంది. కురియకోస్ బృందం ముమ్మరంగా పరిశోధనలు చేస్తోంది.
ఈ హోమియో చికిత్సలో ఐదు రకాల అనుమతి పొందిన హోమియో మందులతో కొత్త డ్రగ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ డ్రగ్ ద్వారా ఇప్పటికే 2వేల మంది కరోనా పేషంట్లకు సప్లిమెంటరీ ఇచ్చి వైద్య బృందం పరీక్షించింది. ఈ చికిత్సతో సత్ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ హోమియో మందు ఫలితాలతో.. కురియకోస్ బృందం ఎయిమ్స్‌కు నివేదిక ఇచ్చారు. దీని క్లినికల్ ట్రయల్స్‌కు ఎయిమ్స్ అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు హోమియో బృందం వెల్లడించింది. క్లినికల్ ట్రయల్స్‌లో వచ్చిన ఫలితాల ప్రకారం కరోనా వైద్యానికి ప్రత్యామ్నాయంగా హోమియో చికిత్సను అందుబాటులోకి తీసుకురానున్నారు.
Also Read: