ప్రారంభమైన శ్రీవారి దర్శనం

| Edited By: Pardhasaradhi Peri

Jun 11, 2020 | 10:21 AM

తిరుమల గిరులు భక్తులతో కలకలలాడుతున్యాయి. లాక్‌డౌన్ కారణంగా దాదాపు 82 రోజుల విరామం తర్వాత శ్రీవారి దర్శనం ప్రారంభమయ్యింది. గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ట్రాయల్ రన్ విజయవంతం కావడంతో ఇవాళ్టి నుండి సాధారణ భక్తులకు దర్శనం భాగ్యం కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం....

ప్రారంభమైన శ్రీవారి దర్శనం
Follow us on

తిరుమల గిరులు భక్తులతో కలకలలాడుతున్యాయి. లాక్‌డౌన్ కారణంగా దాదాపు 82 రోజుల విరామం తర్వాత శ్రీవారి దర్శనం ప్రారంభమయ్యింది. గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ట్రాయల్ రన్ విజయవంతం కావడంతో ఇవాళ్టి నుండి సాధారణ భక్తులకు దర్శనం భాగ్యం కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ముందుగా.. స్వామివారిని వీఐపీలు అనంతరం సామాన్య భక్తులు దర్శించుకున్నారు. నేడు ఆన్‌లైన్‌లో బక్ చేసుకున్న మూడు వేల మంది కాగా.. మరో మడూ వేల మంది ఆఫ్ లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులు శ్రీవారిని దర్శించుకోనున్నారు. ట్రయల్ రన్‌లో నిన్న శ్రీవారిని 7,200 మంది స్థానికులు దర్శించుకున్నారు.

టికెట్లు ఉన్నవారినే మాత్రమే దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతిస్తున్నారు. కంటైన్మెంట్ జోన్లు, రెడ్ జోన్ లో ఉన్న భక్తులు శ్రీవారి దర్శనానికి రాకూడదని టీటీడీ విజ్ఞప్తి చేసింది. శ్రీవారి దర్శనాలకు వచ్చిన భక్తులకు రాన్‌ డమ్‌ గా కోవిడ్ టెస్టులు నిర్వహించడానికి స్విమ్స్ లో ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఆన్ లైన్ లో 60 వేల టికెట్లను 30 గంటల్లో భ​​​క్తులు కొనుగోలు చేశారు. నేడు మూడువేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోనున్నారు. టీటీడీ సిబ్బంది అలిపిరి వద్ద భక్తులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్నారు.