కరోనా ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఎలా ఉందో తెలిసిందే. తాజాగా మనదేశంలో కూడా దీని వ్యాప్తి విస్తరిస్తుండటంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ ప్రభావంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో 152 మంది ఈ వైరస్ సోకి ఆస్పత్రిపాలయ్యారు. దీంతో అంతా అలర్ట్ అయ్యారు. ఇప్పటికే తెలంగాణలో కూడా ఆరు పాజిటివ్ కేసులు రావడంతో.. ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే తాజాగా.. తెలంగాణ డెంటల్ కౌన్సిల్ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో మూడు వారాలపాటు… అన్ని రకాల దంత పరీక్షలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర డెంటల్ కౌన్సిల్ తెలిపింది. డెంటల్ డాక్టర్స్.. కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎమర్జెన్సీ సేవలన్నీ కొనసాగుతాయని.. మిగతా సేవలకు మాత్రం మూడు వారాల పాటు నిలిపివేయనున్నట్లు తెలిపారు.