చైనా రాజధానిలో కరోనా కలకలం.. 55 రోజుల తరువాత..!

| Edited By:

Jun 13, 2020 | 8:10 AM

కరోనా జన్మస్థలం చైనాలో ఇన్నిరోజులు తగ్గుముఖం పట్టినట్లుగానే కనిపించిన వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతోంది. ఆ దేశ రాజధాని బీజింగ్‌లో కొన్ని రోజులుగా కొత్త కేసులు బయటపడుతున్నాయి.

చైనా రాజధానిలో కరోనా కలకలం.. 55 రోజుల తరువాత..!
Follow us on

కరోనా జన్మస్థలం చైనాలో ఇన్నిరోజులు తగ్గుముఖం పట్టినట్లుగానే కనిపించిన వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతోంది. ఆ దేశ రాజధాని బీజింగ్‌లో కొన్ని రోజులుగా కొత్త కేసులు బయటపడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం బీజింగ్‌లో గురువారం ఒకరికి, శుక్రవారం ఇద్దరికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. దీంతో వారిని ఆసుపత్రులకు తరలించిన అధికారులు.. కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో పడ్డారు. అయితే 55 రోజులుగా బీజింగ్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో కరోనా ఫ్రీగా ప్రకటిద్దామని చైనా అధికారులు భావించారు. అయితే ఈ లోపే కొత్త కేసులు రావడంతో మళ్లీ అప్రమత్తమయ్యారు. కాగా చైనాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 83,086కు చేరింది. వీరిలో 78,367 మంది కరోనాను జయించగా.. 4634 మంది చనిపోయారు. ప్రస్తుతం ఆ దేశంలో 85 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read This Story Also: Big Breaking: జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి అరెస్ట్