Big Breaking: జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి అరెస్ట్

టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 154 వాహనాలకు సంబంధించి ఫేక్ ఇన్సూరెన్స్ వ్యవహారంలో

Big Breaking: జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి అరెస్ట్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 13, 2020 | 9:32 AM

టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 154 వాహనాలకు సంబంధించి ఫేక్ ఇన్సూరెన్స్ వ్యవహారంలో అనంతపురం పోలీసులు ఈ ఇద్దరిని అరెస్ట్ చేశారు. రవాణాశాఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హైదరాబాద్‌లోని వారి ఇంట్లో ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిని అనంతపూర్‌కి తరలిస్తున్నారు. ఈ ఇద్దరు బీఎస్‌-3 వాహనాలను నకిలీ డాక్యుమెంట్లతో బీఎస్-‌4గా రిజిస్ట్రేషన్‌ చేసి అమ్మకాలు సాగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై కూపీ లాగగా నకిలీ పత్రాలు సృష్టించి 154 వాహనాలు నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు తేలింది. ఈ క్రమంలో వాహనాల ఇన్సూరెన్స్ చెల్లించకుండానే చెల్లించినట్లు నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో జేసీ అస్మిత్ రెడ్డి, 154 బస్సుల నకిలీ యన్ఓసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) కేసులో జేసి ప్రభాకర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి అనంతపురం, తాడిపత్రి పోలీసు స్టేషన్లలో జేసీ ట్రావెల్స్‌పై ఇప్పటిదాకా 27 కేసులు నమోదు కావడం గమనర్హం.

మరోవైపు ఈ కేసులో జేసీ ట్రావెల్స్‌కి చెందిన 60 వాహనాలను రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు. మిగిలిన 94 వాహనాలను జేసీ బ్రదర్స్ అఙ్ఞాతంలో దాచిపెట్టారని అధికారులు చెబుతున్నారు. ఇక జేసీ ట్రావెల్స్‌ వాహనాల్లో ప్రయాణించే వారికి ఇకపై ఇన్సూరెన్స్‌ వర్తించదని అధికారులు తేల్చి చెప్పారు. దీనిపై అనంతపురం డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ శివరాం ప్రసాద్ మాట్లాడుతూ..  జేసీ ట్రావెల్స్ చాలా తప్పులు చేసింది. స్క్రాప్‌ కింద కొనుగోలు చేసిన బస్సులు, లారీలను రోడ్లపై నడపడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్దం. ఈ విషయంపై జేసీ కుటుంబ సభ్యులకు నోటీసులు అందించాం. జేసీ ఫోర్జరీ వ్యవహారంపై ఉన్నతాధికారులకు నివేదిక అందించామని అన్నారు.

Read This Story Also: ఈఎస్‌ఐ స్కాం.. అచ్చెన్నాయుడికి 14 రోజుల రిమాండ్

Latest Articles
పొట్ట నింపని పద్మశ్రీ.. రోజువారీ కూలీగా కిన్నెర మొగిలయ్య.. వీడియో
పొట్ట నింపని పద్మశ్రీ.. రోజువారీ కూలీగా కిన్నెర మొగిలయ్య.. వీడియో
త్వరలోనే 10 గ్రాముల బంగారం రూ.2 లక్షలు? పెట్టుబడిదారులకు పండగే..!
త్వరలోనే 10 గ్రాముల బంగారం రూ.2 లక్షలు? పెట్టుబడిదారులకు పండగే..!
టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ మరో అవతారం.. అదేంటో తెలుసా?
టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ మరో అవతారం.. అదేంటో తెలుసా?
ఈ ఫొటోలో ఉన్న చిన్నారి.. ఇప్పుడు హాట్ నెస్‌కు కేరాఫ్ అడ్రస్..
ఈ ఫొటోలో ఉన్న చిన్నారి.. ఇప్పుడు హాట్ నెస్‌కు కేరాఫ్ అడ్రస్..
ముసలోడేగానీ మహానుభావుడు.. స్కూటీలో ఏం దాచాడో చూడండి! వీడియో
ముసలోడేగానీ మహానుభావుడు.. స్కూటీలో ఏం దాచాడో చూడండి! వీడియో
పన్ను ప్రయోజనం కోసం జీవిత బీమా తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి..
పన్ను ప్రయోజనం కోసం జీవిత బీమా తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి..
ఏటీఎం నుంచి డబ్బు రాకుండా మీ అకౌంట్ నుంచి కట్ అయ్యాయా..?
ఏటీఎం నుంచి డబ్బు రాకుండా మీ అకౌంట్ నుంచి కట్ అయ్యాయా..?
పేరెంట్స్‌ చేసే ఈ తప్పుల వల్లే.. చిన్నారుల్లో మధుమేహం..
పేరెంట్స్‌ చేసే ఈ తప్పుల వల్లే.. చిన్నారుల్లో మధుమేహం..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి