స్టార్ హీరో పక్కన ఐటెం సాంగ్ కి రెడీ అవుతున్న శ్రీముఖి

Phani.ch

03 May 2024

బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒకటికి రెండు షోలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది.

శ్రీముఖికు కేవలం యాంకరింగ్ ఒకటి మాత్రమే కాదు మంచి నటిగా ఎదగడమే తన టార్గెట్.. అసలు పరిశ్రమలోకి అడుగు పెట్టిందే నటి కావాలని.

శ్రీముఖి కు తొలినాళ్లలోనే క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురయ్యాయట. అందువల్ల యాంకరింగ్ వైపు వెళ్లిందట ఈ ముద్దుగుమ్మ.

యాంకర్ గా ఇమేజ్ వచ్చాక శ్రీముఖి అనేక చిత్రాల్లో నటించింది. కాకపొతే అవన్నీ చిన్న పాత్రలనే చెప్పాలి. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ రోల్ చేయడం విశేషం.

క్రేజీ అంకుల్స్ సినిమా ఆశించిన స్థాయి లో ఆడలేదు. ఇలాంటి చిన్న చిన్న చిత్రాల్లో నటించడం వలన ఎటువండి ప్రయోజనం లేదని శ్రీముఖికు అర్ధమైంది.

ఇది ఇలా ఉంటే శ్రీముఖి గురించి ఒక వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.. అదేంటో కాదు ఒక స్టార్ హీరో హీరో సినిమాలో ఐటమ్ సాంగ్ ఆఫర్ వచ్చిందట.

ఆ స్టార్ హీరో ఎవరోకాదు మెగాస్టార్.. విశ్వంభర చిత్రంలో ఓ మాస్ ఐటెం సాంగ్ ఉందట. ఈ సాంగ్ లో చిరంజీవికి జంటగా శ్రీముఖిని ఎంపిక చేశారట.