అందం కోసం సర్జరీ.. సీక్రెట్ బయట పెట్టిన సాయి పల్లవి
Phani.ch
03 May 2024
సాయి పల్లవి తెలుగు ప్రజలకు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.. తన అందంతో, డ్యాన్స్ తో, నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.
సాయి పల్లవి మలయాళీ అయిన తెలుగు మంచి క్రేజ్ సంపాదించుకుంది. మలయాళంలో ప్రేమమ్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది.
సాయి పల్లవి తెలుగులో మొదటి సినిమా ఫిదా. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వటం తో తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోయింది.
నేచురల్ బ్యూటీగా, లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. తన సహజ నటనతో పాటు మేకప్ లేకుండా నేచురల్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది.
అయితే తాజాగా సాయి పల్లవి సర్జరీ చేయించుకున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందుకే తాజాగా అందంగా కనపడుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈ విషయం పై సాయి పల్లవి క్లారిటీ ఇచ్చింది. ప్రేమమ్ సినిమా చేసే సమయం లో నా ముఖం మీద ఎక్కువగా మొటిమలు ఉండేవి.
నాకు ఆ చిత్రంలో ఆఫర్ రావడానికి కారణం కూడా మొటిమలే. ఇప్పుడు నా ముఖం మీద మొటిమలు లేవు. అవి పోవటానికి నేను ఎటువంటి సర్జరీలు చేయించుకోలేదు.
టీనేజ్ అమ్మాయిలకు మొటిమలు రావడం సాధారణం. వాటికి చికిత్స అవసరం లేదు. వయసు పెరిగేకొద్దీ వాటంతటికి అవే పోతాయి. నేను ఆర్గానిక్ ఫుడ్, అలోవెరా జెల్ వాడతాను. అని సాయి పల్లవి చెప్పుకొచ్చారు.