కౌన్సిలర్లకు పాజిటివ్.. క్వారంటైన్‌లో మేయర్..!

| Edited By:

Jul 24, 2020 | 7:27 PM

కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా అన్‌లాక్‌ 1.0 తర్వాత రాష్ట్రంలో కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయాయి. గత కొద్ది రోజులుగా స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులను..

కౌన్సిలర్లకు పాజిటివ్.. క్వారంటైన్‌లో మేయర్..!
Follow us on

కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా అన్‌లాక్‌ 1.0 తర్వాత రాష్ట్రంలో కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయాయి. గత కొద్ది రోజులుగా స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులను కూడా వదలడం లేదు. తాజాగా తిరువనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ఏడుగురు కౌన్సిలర్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వెంటనే తిరువనంతపురం మేయర్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారికి తెలియజేశారు. ప్రస్తుతం తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని.. పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.

కాగా, కేరళలో గురువారం నాడు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కరోనా కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తోంది. అంతేకాదు కరోనా వ్యాపిస్తున్న ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.