Coronavirus: ప్రస్తుతం ఏ ఇంట్లో చూసిన జ్వరంతో బాధపడుతున్న వారు కనిపిస్తున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఫీవర్ సర్వేలో (Fever Survey) భాగంగా ఏ ఇంటి తలుపు కొట్టినా ఇంట్లో కచ్చితంగా ఇంట్లో జ్వరాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో సీజనల్ వ్యాధులు పెరిగాయి. జ్వరాలకు కూడా ఇదే కారణంగా చెప్పవచ్చు.
అయితే ఈ ఫీవర్ లక్షణాలు కూడా కరోనాను (Corona) పోలి ఉండడంతో చాలా మంది భయపడుతున్నారు. కరోనా సోకిందేమోనన్న భయంతోనే వ్యాధి మరింత ఎక్కువవుతోంది. అయితే సీజనల్ వ్యాధికి, కరోనా వ్యాధికి మధ్య వ్యత్యాసాన్నికొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. ఇంతకీ సీజన్ వ్యాధుల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.? కరోనాలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో.. ఇప్పుడు చూద్దాం..
* సాధారణ జ్వరం ఉంటుంది. సహజంగా అయితే జ్వరం మూడు రోజుల్లో తగ్గిపోతుంది.
* జలుబు ఉంటుంది. ముక్కు కారడంతో పాటు, కఫంతో కూడిన దగ్గు వస్తుంది.
* సీజన్‌లో వ్యాధి బారిన పడ్డ వారికి రుచి, వాసన తెలుస్తుంది. ఒంటి నొప్పులు సాధారణంగా ఉంటాయి. తలనొప్పి కూడా ఉంటుంది.
* జలుబు ఎక్కువగా అయిన వారిలో కొందరిలో గొంతు నొప్పి ఉంటుంది. అయితే ఛాతిలో మాత్రం ఎలాంటి నొప్పి ఉండదు.
* కరోనా వైరస్ సోకిన వారిలో జ్వరం తీవ్రంగా ఉంటుంది. మూడు రోజులు కంటే ఎక్కువ జ్వరంలో ఉంటే వెంటనే పరీక్షకు వెళ్లడమే ఉత్తమం.
* జలుబు ఉన్నా ముక్కు కారదు, ఇక పొడి దగ్గు కనిపిస్తుంది.
* కరోనా సోకిన వారు కచ్చితంగా రుచి, వాసన కోల్పోతారు.
* ఒంటి నొప్పులు తీవ్రంగా ఉంటాయి. తలనొప్పి కూడా అధికంగా ఉంటుంది.
* గొంతు నొప్పితో పాటు, ఛాతిలో కూడా నొప్పి ఉంటుంది. కళ్లు ఎర్రబడతాయి.
RBI Restrictions: ఆ బ్యాంకులపై ఆర్బీఐ నిషేధం.. ఖాతాదారులు రూ.1 లక్ష కంటే ఎక్కువ విత్‌డ్రా చేయలేరు
Top Up loan: టాప్-అప్ లోన్ అంటే ఏమిటి.. ఇది గోల్డ్, పర్సనల్ లోన్ కంటే బెటరా..