Corona India: కరోనా విలయతాండవం ఇప్పట్టో ఆగేలా కనిపించడం లేదు. సెకండ్ వేవ్ రూపంలో పంజా విసురుతోన్న కరోనా ప్రస్తుతం దేశాన్ని అతలాకుతం చేస్తోంది. రోజుకు ఏకంగా రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయంటేనే పరిస్థితి ఎలా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక కరోనా వ్యాప్తికి ఇప్పట్లో అడ్డుకట్ట పడేట్లు లేదని మరో రెండు నెలల పాటు కరోనా సెకండ్ వేవ్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే కొవిడ్ 19 భారత్‌లో నియమించిన లాన్సెట్ అనే టాస్క్‌ఫోర్స్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. రానున్న రెండు నెలలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని… దేశంలోకరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే థియేటర్లు, ఆడిటోరియాలు ఎట్టి పరిస్థితుల్లో మూసివేయాలని, ఇండోర్ సమావేశాలపై కనీసం రెండు నెలలపాటు పూర్తిగా నిషేధం విధించాలని సూచింది. ఇక ప్రస్తుతం దేశంలో ఈ స్థాయిలో కరోనా కేసులు పెరుగుతుండడానికి కారణాలను వివరిస్తూ.. దేశంలో ప్రస్తుతం పెళ్లిళ్లు, పండుగలు, తదితర మతపరమైన, సామాజిక కార్యక్రమాలపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడం, కంభమేళా, ఎన్నికలు వైరస్ తీవ్రంగా వ్యాపించడానికి కారణనమి చెప్పుకొచ్చారు. భారత్‌లో కేసులు ఒక్కసారిగా పెరగడానికి ఇవే కారణమని తేల్చి చెప్పింది. కరోనాను కట్టడి చేయాలంటే.. రెండు నెలలపాటు ఎక్కువ మంది ఒక గుమిగూడకుండా నిషేధం విధించాలని, ఈ విషయంలో కఠినమైన నిఘా పాటించాలని సూచింది. టెస్టింగ్, ట్రాకింగ్, టెస్టింగ్ విధానాన్ని సమర్థంగా కొనసాగించాలని, అలా అయితేనే కరోనా కట్టడి సాధ్యమని తేల్చి చెప్పింది.
Also Read: Megastar Chiranjeevi: చిరు సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్.. నో చెప్పిన అనురాగ్ కశ్యప్..