Coronavirus: దేశంలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా వ్యాపిస్తూనే ఉంది. రోజురోజుకీ కరోనా కేసులు ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 3.47 లక్షల కొత్త కేసులు నమోదాయ్యాయంటేనే పరిస్థితి ఎంతలా చేయి దాటిపోతోందో అర్థం చేసుకోవచ్చు. సెకండ్ వేవ్ సమయం నాటి పరిస్థితులకు దేశం మెల్లిగా జారకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే సాధారణంగా వైరస్ ఒకరి నుంచి మరొకరకి వ్యాపిస్తుందని మనందరికీ తెలిసిందే. అంటే కరోనా సోకిన వారితో కాంటాక్ట్‌లో ఉంటేనే వైరస్ సోకే అవకాశాలు ఉండాలి. కానీ తాజాగా నమోదవుతోన్న కొన్ని కేసులు చూస్తుంటే ఎలాంటి కాంటాక్ట్ హిస్టరీ లేకుండానే వైరస్ వ్యాప్తి చెందుతోన్న ఉదాహరణలు కనిపిస్తున్నాయి.
తాజాగా నోయిడాకు చెందిన మహిళకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే డిసెంబర్ 1 నుంచి అసలు ఇంటి నుంచి బయటకు రాకుండా జాగ్రత్తగా ఉంటున్న సదరు మహిళలకు జనవరి 3న కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ఎలాంటి కాంటాక్ట్ లేకుండా అసలు కరోనా ఎలా సోకిందని ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. సెకండ్ వేవ్‌లో కరోనా బారిన పడిన సదరు మహిళ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మళ్లీ కరోనా సోకడం అందరినీ ఆందోళనకు గురించింది. మరి ఎలాంటి కాంటాక్ట్ హిస్టరీ లేకపోయిన అసలు కరోనా ఒకరి నుంచి మరొకరికి ఎలా సోకుతుందన్న దానిపై నిపుణులు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అవేంటంటే..
* కొందరిలో కరోనా బారిన పడినప్పటికీ లక్షణాలు కనిపించడం లేదు. వారిలో కరోనా వచ్చి వెళ్లిన విషయాన్ని కూడా గుర్తించడం లేదు. శరీరంలో యాంటీ బాడీలు ఉండడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే ఇలాంటి వాళ్లు ఎక్కువగా కరోనాను వ్యాప్తి చెందిస్తున్నారు. తమలో కరోనా వైరస్ ఉందని తెలియకుండానే ఇతరులకు వ్యాపిస్తున్నారు. దీంతో కరోనా సోకినట్లు తెలియని వ్యక్తి నుంచి కూడా వైరస్ వ్యాపిస్తుంది. ఇది వైరస్ కాంటాక్ట్ చెయిన్ తెలియకుండా చేస్తుంది.
* ఇక కొందరిలో శరీరంలోకి వైరస్ ప్రవేశించిన 2 నుంచి 3 రోజుల వరకు గానీ లక్షణాలు కనిపించడం లేదు. ఈ కారణంగా కూడా ఇతరులకు వైరస్ వ్యాపించే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిలో కరోనా లక్షణాలు బయటపడకపోయినప్పటికీ అతనితో ఉన్న వారికి వైరస్ సోకే అవకాశాలు ఉంటాయి.
* తక్కువ టెస్టులు చేయడం కూడా కరోనా వ్యాప్తికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా వైరస్ సోకిన వారు ముందుగానే పరీక్షలు చేయించుకొని ఉంటే వారు ఐసోలేషన్‌లోకి వెళ్లడం ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడేది. కానీ అలా చేయడకపోవడంతో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. అందుకే రాష్ట్రాలను కరోనా పరీక్షలను కేంద్రం ఆదేశిస్తోంది.
* ఇక తాజాగా వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తుండడం కూడా పెరుగుతోన్న కరోనా కేసులకు కారణంగా చెబుతున్నారు. ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారి నోటి తుంపరల ద్వారా వైరస్ గాలిలో వేగంగా వ్యాపిస్తుంది. దీంతో సమీపంలో ఉన్న వారు కరోనా బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
Also Read: AP CM YS Jagan: వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై ప్రధాని మోడీ సమీక్ష.. పాల్గొన్న ఏపీ సీఎం జగన్
IPL 2022 Mega Auction: ఐపీఎల్ మెగా వేలానికి దూరం కానున్న స్టార్ ఆటగాళ్లు.. ఎందుకో తెలుసా..
Viral Video: ఇలాంటి కోతి నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. వీడియో చూస్తే మీరూ అదే అంటారు..!