Telugu News CoronaVirus Telengana people lockdown extends till 28 may and liquor prizes will be raised
తెలంగాణలో మే 28 వరకు లాక్‌డౌన్ ! లిక్కర్ ధరల పెంపు ?
తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగింపు, సడలింపుల అంశంపై మరికాసేపట్లో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ కొనసాగుతోంది. ఈ మేరకు కేంద్రం ప్రకటించిన గడువు కంటే మరో రెండు వారాలు తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో మద్యం షాపుల ఓపెనింగ్‌పై కూడా కేబినెట్ భేటీలో చర్చ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఈ నెల 28 వరకూ లాక్ డౌన్ పొడిగించే యోచనలో […]
తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగింపు, సడలింపుల అంశంపై మరికాసేపట్లో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ కొనసాగుతోంది. ఈ మేరకు కేంద్రం ప్రకటించిన గడువు కంటే మరో రెండు వారాలు తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో మద్యం షాపుల ఓపెనింగ్‌పై కూడా కేబినెట్ భేటీలో చర్చ కొనసాగుతోంది.
రాష్ట్రంలో ఈ నెల 28 వరకూ లాక్ డౌన్ పొడిగించే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. గ్రీన్ , ఆరెంజ్ జోన్లలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే, మధ్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 20 నుంచి 60% ధరలు పెంచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే రెడ్ జోన్లలో మాత్రం లాక్‌డౌన్‌ను అత్యంత కఠినంగా అమలు చేయనున్నారు.
ఇదిలా ఉంటే, మరోవైపు కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు అటు, దేశంలోనూ లాక్‌డౌన్ పొడిగించే అవకాశం ఉందని ఇప్పటికే అందిన సమాచారం. మొత్తం మీద దేశంలో విస్తరిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకుంటునే..ఇటు దేశ, రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను బాగుచేసుకునే పనిలో పడ్డాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనే ప్రచారం జరుగుతోంది.