ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ.. చర్చకు వచ్చే అంశాలు ఇవే..

| Edited By:

May 18, 2020 | 1:21 PM

మరోసారి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అందుకు కొత్త మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 29 వరకూ లాక్‌డౌన్ విధించారు. దీంతో తెలంగాణలో ఏం చేయాలన్న అంశంపై ఇవాళ ప్రభుత్వం..

ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ.. చర్చకు వచ్చే అంశాలు ఇవే..
Follow us on

మరోసారి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అందుకు కొత్త మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 29 వరకూ లాక్‌డౌన్ విధించారు. దీంతో తెలంగాణలో ఏం చేయాలన్న అంశంపై ఇవాళ ప్రభుత్వం కొత్త  మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఇందుకోసం సాయంత్రం 5 గంటలకు తెలంగాణలోని ప్రగతి భవన్‌లో.. కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్ అంత్యంత కీలకం కానుంది. ప్రస్తుతం తెలంగాణలో తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం ఈ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి మినహాయింపులు ఇస్తుంది? లాక్‌డౌన్‌ను పొడిగిస్తుందా? మళ్లీ ఎలాంటి కొత్త మార్గదర్శకాలు జారీ కాబోతున్నాయి? అనే దానిపై ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కేబినెట్ భేటలో ముఖ్యంగా చర్చకు వచ్చే కీలకాంశాలు ఇవే:

– ముఖ్యంగా లాక్‌డౌన్ పొడిగిస్తారా? లేదా?
– సమగ్ర వ్యవసాయ విధానంపై దృష్టి
– వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడం
– సాగునీటి ప్రాజెక్టులపై చర్చ
– రైతులు ఏ పంటలు పండించాలి
– వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
– ఆర్టీసీ బస్సులు నడపాలా? వద్దా?
– అలాగే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచుతూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 203 అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Read More: 

రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు.. ఈ రోజు తేలనుంది

గుడ్‌న్యూస్.. వారికి 3 నెలలు గ్యాస్ సిలిండర్ ఉచితం