Telangana coronavirus: జోరు పెంచిన కరోనా వైరస్ వ్యాప్తి.. తెలంగాణలో పాజిటివ్ కేసులు ఎన్నంటే..!

|

Mar 31, 2021 | 11:29 AM

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కోవిడ్ వైరస్ మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇంతకాలం తక్కువ కేసులు నమోదైన రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు అందోళనకు గురిచేస్తున్నాయి. సోమవారం రాత్రి 8గంటల నుంచి...

Telangana coronavirus: జోరు పెంచిన కరోనా వైరస్ వ్యాప్తి.. తెలంగాణలో పాజిటివ్ కేసులు ఎన్నంటే..!
Corona Virus
Follow us on

Telangana Coronavirus: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కోవిడ్ వైరస్ మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇంతకాలం తక్కువ కేసులు నమోదైన రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు అందోళనకు గురిచేస్తున్నాయి. సోమవారం రాత్రి 8గంటల నుంచి మంగళవారం రాత్రి 8గంటల వరకు 56,122 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 684 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 3,07,889కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం కోవిడ్ బులిటెన్‌ విడుదల చేసింది.

కాగా, రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే కరోనా బారినపడి మరో ముగ్గరు ప్రాణాలను కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1697కు చేరింది. కరోనా బారి నుంచి మంగళవారం 394మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం 4,965 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు అధికారుల పేర్కొన్నారు. వీరిలో 1,873 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగ, మిగిలిన వారు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు 1,01,51,689 కొవిడ్‌ టెస్టులు నిర్వహించారు.

ఇది కూడా చదవండి : ఏప్రిల్ 1 నుంచి ఈ 5 పనులను ప్రారంభించండి… కష్ట సమయాల్లో కూడా డబ్బు కొరత ఉండదు..

ఇది కూడా చదవండి : Amazing Tips: ముఖం అందంగా మెరవాలా? క్యారెట్ ఫేస్ ప్యాక్.. ఇదిగో ఇలా ట్రై చేయండి…!