Passport Services In Telangana: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. భారీగా పెరిగిన కేసుల కారణంగా దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. ఇక ఈ నిర్ణయంతో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. చాలా రోజుల తర్వాత దేశంలోకరోనా కేసులు అదుపులోకి వచ్చాయి. దీంతో లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం సైతం భారీ సడలింపులు ఇచ్చింది.
తాజాగా గురువారం నుంచి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు లాక్‌డౌన్ నిబంధలను సడలింపులిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం పగటిపూట లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన నేపథ్యంలో.. పలు రకాల సాధారణ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా పోస్టాఫీసుల్లో పాస్‌పోర్ట్ సేవలను పునరుద్ధరించారు. నేటి నుంచి (గురువారం) ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే.. లాక్‌డౌన్ కారణంగా గత నెల 12న ఈ పాస్‌పోర్ట్ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అత్యవసరంగా విదేశాలకు వెళ్లేవారికి మాత్రం లాక్‌డౌన్‌లో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. అయితే లాక్‌డౌన్ సడలింపులతో తపాలా కార్యాలయాల్లో సేవలు ప్రారంభించామని అధికారులు తెలిపారు. ఈ సేవలు సాధారణ సమయాల్లో అందుబాటులో ఉంటాయి.
Also Read: Ajay Devgan: వరుసగా టాలీవుడ్ ముద్దగుమ్మలనే ఎంచుకుంటున్న బాలీవుడ్ స్టార్ హీరో..