తెలంగాణ వ్యాప్తంగా విదేశీయులపై నమోదైన కేసులు ఇవే..!

| Edited By:

Apr 07, 2020 | 8:21 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీసా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రభుత్వం కొరడా ఝలిపించింది. గత నెల కరీంనగర్‌లో వెలుగు చూసిన ఇండోనేషియన్ల వ్యవహారం గురించి తెలిసిందే. ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌లో జరిగిన తబ్లీఘీ జమాతే మీటింగ్‌ హాజరై… అక్కడి నుంచి కరీంనగర్‌, రామగుండంలో సంచరించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. కరీంనగర్‌లో పలు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొని.. వీసా నిబంధనలను ఉల్లంఘించారు. అంతేకాదు.. వీరంతా కరోనా వైరస్‌ బారినపడ్డవారే. అయితే వీరంతా కరీంనగర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో సంచరించడంతో.. […]

తెలంగాణ వ్యాప్తంగా విదేశీయులపై నమోదైన కేసులు ఇవే..!
Follow us on

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీసా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రభుత్వం కొరడా ఝలిపించింది. గత నెల కరీంనగర్‌లో వెలుగు చూసిన ఇండోనేషియన్ల వ్యవహారం గురించి తెలిసిందే. ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌లో జరిగిన తబ్లీఘీ జమాతే మీటింగ్‌ హాజరై… అక్కడి నుంచి కరీంనగర్‌, రామగుండంలో సంచరించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. కరీంనగర్‌లో పలు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొని.. వీసా నిబంధనలను ఉల్లంఘించారు. అంతేకాదు.. వీరంతా కరోనా వైరస్‌ బారినపడ్డవారే. అయితే వీరంతా కరీంనగర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో సంచరించడంతో.. వీరితో కలిసిన వారికి కూడా కరోనా సోకినట్లు గుర్తించారు. ఇక కేవలం ఇండేనేషియన్లే కాకుండా ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఈ మర్కజ్ సమావేశాలకు హాజరై.. తెలంగాణలోని పలు జిల్లాలో తిరిగుతూ.. మతపరమైన కార్యక్రమాల్లో హాజరైనారు.

ముఖ్యంగా.. ఇండోనేషియ, కిలిచిస్థాన్ , మలేషియా, మయన్మార్ దేశాల నుంచి వచ్చారు. వీరంతా
హైదరాబాద్‌, నల్గొండ, కరీంనగర్ జిల్లాలో ఉన్నారు. వీరికి కొందరు స్థానికులు ఆశ్రయమిచ్చారు. వీసా ఉల్లంఘించిన వారితో పాటుగా.. విదేశీయులకు ఆశ్రయమిచ్చిన వ్యక్తులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో నమోదైన కేసుల వివరాలు చూస్తే.. హైదరాబాద్‌లో 84 మంది విదేశీయులపై కేసులు నమోదయ్యాయి. వీరితో పాటు.. వీరందరికీ ఆశ్రయమిచ్చిన వారిపై కూడ కేసులు నమోదయ్యాయి. ఇక నల్గొండలలో 36 మందిపై కేసులు నమోదయ్యాయి. బర్మాకు చెందిన 18 మందితో పాటు.. మయన్మార్‌కు చెందిన 14 మందిపై.. వారికి ఆశ్రయమిచ్చిన వారిపై.. అటు కరీంనగర్‌లో కూడా.. ఇండోనేషియన్లకు షెల్టర్‌ ఇచ్చిన వారిపై.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 145 మందిపై కేసులు నమోదయ్యాయి.