తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా ఆదివారం నాడు 237 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 4974కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి ముగ్గురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 185కి చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2377 కాగా, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2412 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Media Bulletin
Date: June 14, 2020District wise status update on #Coronavirus positive cases in Telangana pic.twitter.com/wPK4LMKyrU
— Minister for Health Telangana State (@TelanganaHealth) June 14, 2020