గుడ్‌న్యూస్‌!..సరిహద్దు చెక్ పోస్టులు ఎత్తివేత

|

Jun 09, 2020 | 4:50 PM

అన్‌లాక్‌-1.0 ప్ర‌స్తుతం భార‌త్‌లో అమ‌ల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నుంచి సడలింపులను మరింతగా పెంచిన తరువాత, వివిధ రాష్ట్రాలతో ఉన్న సరిహద్దుల వద్ద గతంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను తెలంగాణ ప్రభుత్వం తొలగించింది.

గుడ్‌న్యూస్‌!..సరిహద్దు చెక్ పోస్టులు ఎత్తివేత
Follow us on

అన్‌లాక్‌-1.0 ప్ర‌స్తుతం భార‌త్‌లో అమ‌ల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నుంచి సడలింపులను మరింతగా పెంచిన తరువాత, వివిధ రాష్ట్రాలతో ఉన్న సరిహద్దుల వద్ద గతంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను తెలంగాణ ప్రభుత్వం తొలగించింది. వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వస్తున్న వాహనాలకు ప్రస్తుతం అధికారులు ఎటువంటి ఆటంకాలనూ కలిగించడం లేదు. ఇదే సమయంలో తమ వారిని చూసేందుకు, అత్యవసర పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కు వెళ్లడానికి బయలుదేరుతున్న తెలంగాణ వాసులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు.

ఇదిలా ఉంటే తెలంగాణలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు నెమ్మది నెమ్మదిగా కోవిడ్ బారిన పడుతుండటం కలవరం కలిగిస్తోంది. ఉస్మానియా,పేట్ల బురుజు ప్రసూతి హాస్పిటల్, నిమ్స్ ఇలా డాక్టర్లందరికీ పాజిటివ్ వస్తుండటంతో వైద్యులను కాపాడుకోడానికి యంత్రాంగం అప్రమత్తమైంది.