Telanagana Corona: తెలంగాణ కరోనా కేసుల్లో హెచ్చు తగ్గులు.. కొత్తగా 220మందికి పాజిటివ్, ఒకరు మృతి

తెలంగాణలోనూ కరోనా పాజిటివ్‌ కేసులు ఓ రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. కానీ పాజిటివిటీ రేటు తక్కువగా వుండడం ఊరటనిస్తోంది. తాజాగా గడచిన 24 గంటల్లో కొత్తగా 220 కేసులు నమోదయ్యాయి.

Telanagana Corona: తెలంగాణ కరోనా కేసుల్లో హెచ్చు తగ్గులు.. కొత్తగా 220మందికి పాజిటివ్, ఒకరు మృతి
Corona Cases

Updated on: Sep 10, 2021 | 8:36 PM

Telanagana Covid 19 Cases: తెలంగాణలోనూ కరోనా పాజిటివ్‌ కేసులు ఓ రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. కానీ పాజిటివిటీ రేటు తక్కువగా వుండడం ఊరటనిస్తోంది. తాజాగా గడచిన 24 గంటల్లో తెలంగాణలో 51,004 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 220 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,61,006కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఈ సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌‌లో పేర్కొంది. ఇక, నిన్న కరోనా బారినపడి ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3,892కి చేరింది. కరోనా మహమ్మారి నుంచి నిన్న 338 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,351 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.60 శాతానికి చేరిందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

అయితే.. రాష్ట్రంలో ఈ మధ్యనే తెరుచుకున్న పాఠశాలల్లో కరోనా కేసులు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు, వినాయక నవరాత్రులు కూడా ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలంటున్నారు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై మా ప్రతినిధి ఏలేందర్‌ మరింత సమాచారం అందిస్తారు.

ఇక, జిల్లావారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు చూస్తే….

Read Also… Rare statue: గుప్త నిధుల కోసం దుండగుల వేట.. బయటపడ్డ అరుదైన మూషికా విగ్రహం.. ఇంతకీ ఏంచేశారంటే..?