Telangana corona cases today : రాష్ట్రంలో మరోసారి కరోనా కేసులు వందకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 18,252 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 101 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం విడుదల చేసిన బులెటిన్ వెల్లడించింది. కాగా, 24 గంటల్లో కరోనాతో ఒకరు మాత్రమే చనిపోయినట్లు తెలిపారు. అటు కరోనా మహమ్మారిని జయించిన 197 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యినట్లు పేర్కొన్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,682 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,92,229 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి మృతి చెందినవారి సంఖ్య 1,611కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,842 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 751 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. కాగా, జీహెచ్ఎంసీ పరిథిలో కొత్తగా 24 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Read Also… Covid Vaccine Video: దేశంలో 55 శాతం మంది ఆరోగ్య కార్యకర్తలు కోవిడ్ 19 మొదటి డోస్ వ్యాక్సిన్